BigTV English

Glowing Skin: అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం

Glowing Skin: అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కాలు పాటిస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం

Glowing Skin: సీజన్స్ మారుతున్న కొద్దీ అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సమ్మర్ లో గాలిలో తేమ లేక పోవడం వల్ల పొడిబారిన, గరుకు చర్మం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మీ ముఖం యొక్క కాంతిని తగ్గిస్తుంది. అంతే కాకుండా బయట మార్కెట్ లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా వివిధ రకాల చర్మ సమస్యలు వస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. అమ్మమ్మ ల కాలం నాటి స్కిన్ కేర్ పాటించడం ముఖ్యం.


ఇవి మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. అమ్మమ్మ కాలం నాటి హోం రెమెడీస్ మీ చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడటమే కాకుండా మృతకణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండానే గ్లోయింగ్ స్కిన్ అందిస్తాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు, పసుపు పేస్ట్ :


మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలంటే.. పాలు , పసుపు పేస్ట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపు ఒక అద్భుతమైన యాంటీ-ఆక్సిడెంట్. ఇది మీ చర్మాన్ని రిపేర్ చేయడానికి పని చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ హోం రెమెడీ తయారు చేయడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని అందులో తగినంత పాలు కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి 25 నిమిషాలు ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె, నిమ్మకాయ :
ముఖంపై ఉన్న చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేనె, నిమ్మ రసాలను కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ రెండు పదార్థాలలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి చర్మ కాంతిని పెంచడానికి పనిచేస్తాయి. ఈ పేస్ట్ తయారు చేయడానికి ఒక గిన్నెలో ఒక చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం వేసి కలపండి. మీకు కావాలంటే.. మీరు దానికి 4-5 చుక్కల బాదం నూనెను కూడా కలుపుకోవచ్చు. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. తరచుగా ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి.

టమాటో, గంధం పొడి:
టమాటో, గంధం పేస్ట్ చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. అంతే కాకుండా వీటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. ఈ రెమెడీ తయారు చేయడానికి, ఒక చెంచా గంధం పౌడర్, అర చెంచా నిమ్మరసం, ఒక చెంచా టమాటో రసం తీసుకోండి. వీటన్నింటినీ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగి ఆరబెట్టండి. ఇది సన్ ట్యానింగ్ సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

పెరుగు, శనగపిండి:
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పెరుగు మీ చర్మం కోల్పోయిన రంగు , మెరుపును తిరిగి ఇస్తాయి. ఈ పేస్ట్ తయారు చేయడానికి మీరు 1 టేబుల్ స్పూన్ శనగపిండిలో.. ఒక చెంచా పెరుగు, అర చెంచా తేనె అవసరం అవుతాయి. ఈ పదార్థాలను అన్నింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. ఒక మృదువైన పేస్ట్ ఏర్పడిన తర్వాత.. దానిని ముఖం, మెడపై 20 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోండి.

Also Read: ప్రతి రోజు ఉదయం ఈ ఒక్క పని చేస్తే.. మెదడు షార్ప్‌గా పని చేస్తుంది !

వేప ఆకు స్క్రబ్ :
మీ ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉంటే, వేప ఆకుల పేస్ట్ వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని తయారు చేయడానికి 8-10 తాజా వేప ఆకులను తీసుకోండి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చెంచా ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ వేసి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాలు అప్లై చేసి.. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియను వారానికి రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×