BigTV English

Coconut Oil: సమ్మర్‌లో చర్మంపై కొబ్బరి నూనె అప్లై చేస్తే.. ?

Coconut Oil: సమ్మర్‌లో చర్మంపై కొబ్బరి నూనె  అప్లై చేస్తే.. ?

Coconut Oil: వేసవిలో చెమట, సూర్యకాంతి మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా, చర్మం రంగు కూడా నల్లగా మారుతుంది. అంతే కాకుండా ముఖ కాంతి కూడా పూర్తిగా తొలగిపోతుంది. చర్మం పొడిగా, గరుకుగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే చాలా మంది చర్మానికి కొబ్బరి నూనె అప్లై చేస్తూ ఉంటారు.  ఇలా సమ్మర్ లో స్కిన్ పై కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి . ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. వేసవిలో చర్మాన్ని చర్మంపై అప్లై చేయడానికి ముందు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

కొబ్బరి నూనె యొక్క లక్షణాలు:


కొబ్బరి నూనె ఒక సహజ మాయిశ్చరైజర్ ,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చడంతో పాటు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు చికాకు, వాపును కూడా తగ్గిస్తుంది. అదనంగా.. కొబ్బరి నూనెలో విటమిన్ E కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి చర్మ కణాలను పునర్నిర్మించడంలో సహాయపడతాయి.

సూర్య కిరణాల నుండి రక్షణ:
వేసవిలో.. ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఎందుకంటే ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. అంతే కాకుండా చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి… మీరు ఎండలో బయటకు వెళ్ళినప్పుడల్లా, ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ అప్లై చేయండి. SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు.. మీరు ముఖానికి కొబ్బరి నూనెను కూడా అప్లై చేయవచ్చు. దీనిని వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

మొటిమలను నయం చేస్తుంది:
వేసవిలో చెమట కారణంగా చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. వాటిలో మొటిమలు ప్రధానమైనవి. కొబ్బరి నూనె సహాయంతో మీరు ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. కొబ్బరి నూనె యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది చర్మంపై దద్దుర్లు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వాడకం కొల్లాజెన్‌ను కూడా రిపేర్ చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.

Also Read: ఫుడ్ పాయిజన్ అయిందా ? ఇలా చేస్తే.. బిగ్ రిలీఫ్

మృదువైన, మెరిసే చర్మం:
వేసవిలో మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి కొబ్బరి నూనె ఒక సహజ మార్గం. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా తేమగా ఉండేలా చేస్తుంది.రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె వాడటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

చర్మం మృదువుగా మారడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని తక్షణమే మెరిసేలా చేస్తాయి. కొంతమంది చర్మంపై కొబ్బరి నూనె వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×