Maha Kumbh 2025: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి రోజున మొదలైన ఈ వేడుక మహా శివరాత్రి వరకు కొనసాగనుంది. 45 రోజుల పాటు కొనసాగే ఈ ఆధ్యాత్మిక సంబురం కోసం ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు తరలి వస్తున్నారు. ఇప్పటికే 15 కోట్లకు పైగా భక్తులు ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నాగ సాధువులు, ఆఘోరాలు, సాధువులు భారీగా తరలి వస్తున్నారు.
ఇక ప్రయాగరాజ్ లో జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవం కోసం భారతీయ రైల్వే సంస్థ పెద్ద సంఖ్యలో రైళ్లను అందుబాటులో ఉంచింది. దేశ వ్యాప్తంగా సుమారు 13 వేళ రైళ్లను కుంభమేళా కోసం కేటాయించింది. వీటిలో 3 వేల ప్రత్యేక రైళ్లు ఉండగా, మిగతావి రెగ్యులర్ రైళ్లు. కుంభమేళాకు వచ్చిపోయే భక్తలుతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
కుంభమేళా రైలుపై దుండగుల రాళ్ల దాడి
తాజాగా కుంభమేళాకు వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ నుంచి ప్రయాగరాజ్ కు వెళ్తున్న రైలుపై ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. హర్పాల్ పూర్ స్టేషన్ లో రైలు పై రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. కొంత మంది అల్లరి మూక రైలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, రైలు డోర్లు ఓపెన్ కాకపోవడంతో రాళ్లతో కిటికీలు, డోర్లు పగలగొట్టారు.
Vandalism and stone pelting in Maha Kumbh Special train going from Jhansi to Prayagraj. Live video surfaced. The reason for this is not known yet. pic.twitter.com/MizAwOaxJw
— amrish morajkar (@mogambokhushua) January 28, 2025
దాడికి పాల్పడిన వారంతా పరారీ
నిజానికి నిన్న(సోమవారం) రాత్రి 8 గంటలకు ఝాన్సీ స్టేషన్ నుంచి ప్రయాగరాజ్ కు కుంభమేళా రైలు బయల్దేరింది. ఈ రైలు కోసం హర్పల్ పూర్ స్టేషన్ లో ప్రయాణీకులు చాలా సేపటి నుంచి ఈ రైలు కోసం వేచి ఉన్నారు. సాధారణంగా ఝాన్సీ నుంచి బయల్దేరిన రైలు హల్పాల్ పర్ చేరుకోవడానికి 2 గంటల టైమ్ పడుతుంది. కానీ, ఈ రైలు వచ్చే సరికి ఏకంగా రాత్రి 2 గంటలు అయ్యింది. రైలు ఆగినప్పటికీ డోర్లు తెవరకపోవడంతో స్టేషన్ లోని ప్రయాణీకులు ఆగ్రహంతో దాడి చేసినట్లు తెలుస్తున్నది. రాళ్లతో రైలు అద్దాలు, డోర్లు పగులగొట్టారు. అయితే, ప్రయాణీకులు ఎవరూ ఈ దాడికి పాల్పడలేదని రైల్వే పోస్టులు తెలిపారు.
స్పాట్ కు చేరుకున్న పోలీసులు
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. పోలీసులను చూసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో రైల్లోని ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఛతర్ పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ వాల్మిక్ చౌబే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. హల్పాల్ పర్ రైల్వే స్టేషన్ లో రైలు డోర్లు తెరవకపోవడంతో కొంతమంది అల్లరి మూకలు దాడికి పాల్పడినట్లు తెలుస్తున్నది. దాడికి పాల్పడిన వాళ్లంతా పరారయ్యారని వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Also: దేశంలో అత్యంత పురాతన రైల్వే స్టేషన్లు ఇవే.. భారత్ లో ఫస్ట్ స్టేషన్ ను ఎక్కడ నిర్మించారంటే?