Henna For Hair: పొడవాటి జుట్టు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అందాన్ని మరింత రెట్టింపు చేసేది జుట్టు కాబట్టి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోవడం, చుండ్రు ఎక్కువగా ఉండటం, తెల్లజుట్టు రావడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. నిండా 30 ఏళ్లు రాకముందే తెల్లజుట్టు వచ్చేస్తుంది. దీంతో నలుగురిలో తిరగాలన్నా కొందరు చాలా ఇబ్బందిపడుతుంటారు. కొంతమంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు.. ఇంకొంత మంది చాలా సీరియస్‌గా తీసుకుంటారు.
తెల్లజుట్టును కవర్ చేసేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ డై వంటి ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వీటివల్ల జుట్టు పాడైపోయే ప్రమాదం ఉంది. వీటిని రెగ్యులర్‌గా వాడటం వల్లన చర్మ సమస్యలతో పాటు, కంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే హెన్నా తయారు చేసుకున్నారంటే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం హెన్నా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
ఒక కప్పు వాటర్
ఒక టీస్పూన్ బ్లాక్ టీ
టీ స్పూన్ బ్లాక్ సీడ్స్
టేబుల్ స్పూన్ మెంతులు
గోరింటాకు పొడి
కోడిగుడ్డు
మూడు టేబుల్ స్పూన్ పెరుగు
ఆవాల నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక కప్పు వాటర్ పోయాలి. అందులో బ్లాక్ టీ, బ్లాక్ సీడ్స్, మెంతులు వేసి పది నిముషాల పాటు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి.. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో గోరింటాకు పొడి తీసుకుని అందులో తయారు చేసుకున్న వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఐదు నిమిషాలు పక్కనపెట్టి.. ఆ తర్వాత అందులో పెరుగు, కోడిగుడ్డు, ఆవాల నూనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. ఇలా వారానికి ఒకసారి ట్రై చేశారంటే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు క్రమంగా తగ్గిపోవడంతో పాటు, జుట్టు పొడవుగా పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ చుండ్రును నివారించడమే కాకుండా.. జుట్టు సిల్కీగా ఉండేలా చేస్తుంది.
Also Read: జుట్టు పెరగట్లేదని ఫీలవుతున్నారా.. ఈ హెయిర్ ఆయిల్ రాస్తే జుట్టు పెరగటాన్ని ఎవరూ ఆపలేరు
ఉసిరి, హెన్నా హెయిర్ మాస్క్..
తెల్ల జుట్టు నివారణకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఈ హెయిర్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. వీటిలో జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందుకోసం ఒక చిన్న బౌల్‌లో నాలుగు టేబుల్ స్పూన్ ఉసిరి పొడి.. రెండు టేబుల్ స్పూన్ గోరింటాకు పొడి, అందులో కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి. కొద్దిసేపటి తర్వాత జుట్టు కుదుళ్ళకు అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల క్రమంగా తెల్ల జుట్టును నివారిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.