BigTV English

Rana daggubati Assets: రానాకి అదృష్టం భలే కలిసొచ్చిందే.. తన సంపాదనే కాదు.. తాతా తండ్రి నుండి ఎన్ని కోట్లంటే..?

Rana daggubati Assets: రానాకి అదృష్టం భలే కలిసొచ్చిందే.. తన సంపాదనే కాదు.. తాతా తండ్రి నుండి ఎన్ని కోట్లంటే..?

Rana daggubati Assets:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి(Daggubati)కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వివాదాలకు పోకుండా, కాంట్రవర్సీలకు తావు ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు ఈ ఫ్యామిలీ సభ్యులు. ముఖ్యంగా ఈ ఫ్యామిలీలో ఉండే హీరోలు, నిర్మాతలు బయట కనిపిస్తారు కానీ వీరి కుటుంబ సభ్యులు ఏ రోజు కూడా తెర ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. దీనికి తోడు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఫంక్షన్ కానీ పెళ్లిళ్లు కానీ జరిగినా ఈ కుటుంబంలోని వారు మాత్రం ఎప్పుడు కనిపించకపోవడంతో అభిమానులు వీరి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


వారసత్వం కొనసాగింపు..

ఇదిలా ఉండగా దగ్గుబాటి రామానాయుడు(Daggubati Ramanaidu) తర్వాత ఆయన పరంపరను కొడుకులిద్దరూ కొనసాగిస్తున్నారు. అందులో మొదటి కొడుకు సురేష్ బాబు(Suresh Babu) నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించగా.. చిన్న కొడుకు వెంకటేష్(Venkatesh) ఫ్యామిలీ స్టార్ గా భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇటీవలే తన 75వ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వెంకటేష్. ఇక ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే వీరి తర్వాత వీరి వారసుడు దగ్గుబాటి రానా (Daggubati Rana) ఆ పరంపరను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1,2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు రానా.


లీడర్ సినిమాతో తొలి ప్రయత్నం..

ఇక ఇప్పుడు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు టాక్ షోలు నిర్వహిస్తూ భారీ పాపులారిటీ అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. 2010లో ‘లీడర్’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రానా. ఆ తర్వాత ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం ‘బాహుబలి’ అనే చెప్పాలి. బాహుబలిలో ‘భల్లాలదేవ’ పాత్రలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీ అందుకున్నారు. ఈ సినిమాల తరువాత రానా సోలో హీరోగా చేసిన ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉండడంతో పలు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. కేవలం సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా ప్రారంభించారు.

రానా దగ్గుబాటి రెమ్యునరేషన్..

ఇకపోతే 2023 సంవత్సరం నుండి ఏడాదికి 9కోట్ల రూపాయలు యావరేజ్ గా సంపాదిస్తున్నారు. ఎక్కువగా ఆక్టింగ్ మీదనే రెమ్యూనరేషన్ వస్తుండగా, ఆ తర్వాత బిజినెస్ లలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు బ్రాండ్ ప్రమోషన్లు, అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి రూ.4 నుంచి రూ.5కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఒక్కొక్క బ్రాండ్ ను ప్రమోట్ చేయాలంటే రూ.80 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఆయన సియట్ టైర్లు, ప్రో కబడ్డీ లీగ్, రామరాజు కాటన్, కోకోకోలా స్మార్ట్ వాటర్ తో పాటు తెలుగు టైటాన్స్ వంటి వాటిని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

రానా దగ్గుబాటి ఆస్తులు..

ఇక ఈయన దగ్గర ఉండే కార్ల విషయానికొస్తే బియ్యండబ్ల్యూ సెవెన్ సిరీస్, జాగ్వార్ ఎక్సెస్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ తో పాటు పలు లగ్జరీ కార్లు కూడా ఈయన సొంతం. ఇకపోతే రానాకి తండ్రి నుంచి, తాతల నుంచి దాదాపు రూ.2000 వేలకోట్ల వరకు ఆస్తి వస్తుందని సమాచారం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లలో వీరు పెట్టుబడి పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే వీరి ఆస్తులు కూడా పెరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తండ్రి, తాతల ద్వారా వేలకోట్ల ఆస్తులు వారసత్వంగా రావడంతో రానా అదృష్టం మామూలుగా లేదుగా అని నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×