BigTV English

Henna For White Hair: కెమికల్ డైతో పనిలేదు..హెన్నాలో వీటిని కలిపి వాడితే.. జీవితంలో తెల్ల జుట్టు రాదు

Henna For White Hair: కెమికల్ డైతో పనిలేదు..హెన్నాలో వీటిని కలిపి వాడితే.. జీవితంలో తెల్ల జుట్టు రాదు

Henna For White Hair: నిండా ముప్ఫై ఏళ్లు నిండక ముందే ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు రావడం కామన్ అయిపోయింది. దీనికి జన్యులోపాలు, ఒత్తిడి, దుమ్మూ, ధూళి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఇతర కారణాలు కావచ్చు. జుట్టు ఊడిపోకుండా ఉండటం కోసం, తెల్ల జుట్టు నివారణకు చాలా మంది అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయే తప్పా.. శాశ్వత పరిష్కారం ఉండదు. పైగా వీటివల్ల జుట్టు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. శాశ్వతంగా తెల్లజుట్టు నివారించాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఇందుకు గోరింటాకు చక్కగా పనిచేస్తుంది.


వీటిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి, పొడవుగా ఒత్తుగా పెరిగేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్యలతో పాటు.. చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
గోరింటాకు పొడి
మెంతులు
బీట్ రూట్
కలబంద


తయారుచేసుకునే విధానం..
ముందుగా మెంతులను 10 గంటల పాటు నాన బెట్టుకుని, ఆ తర్వాత మెత్తగా పేస్ట్ చేసి వడకట్టుకోవాలి. అదే మిక్సీజార్‌లో బీట్ రూట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో గోరింటాకు పొడి తీసుకుని, అందులో బీట్ రసం, మెంతులు పేస్ట్, కలబంద గుజ్జు వేసి బాగా కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలానే ఉంచి.. మరుసటి రోజు తలకు అప్లై చేయండి.

60 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు, మూడు సార్లు చేస్తే.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పొడువుగా, ఒత్తుగా పెరుగడంతో పాటు.. చుండ్రు సమస్యలను కూడా నివారిస్తుంది. మీరు ఓసారి ట్రై చేసి చూడండి.

Also Read: అల్లంతో అద్భుతాలు.. ఇలా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అస్సలు రావు

తెల్లజుట్టును నివారించేందుకు ఈ చిట్కా కూడా పాటించండి. చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం..

కావాల్సిన పదార్ధాలు
మెంతులు
కరివేపాకు
షికా కాయ పొడి
ఉసిరి పొడి
గోరింటాకు పొడి
టీ పొడి

తయారు చేసుకునే విధానం

ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి.. అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు టేబుల్ స్పూన్ మెంతులు, కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ టీ పొడి వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ వాటర్‌ని వేరే గిన్నెలో వడకట్టుకోవాలి. అందులో గోరింటాకు పొడి, ఉసిరి పొడి, షికా కాయ పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలానే ఉంచి, మరుసటి రోజు అందులో గుడ్డు తెల్ల సొన వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకు అప్లై చేసి.. 40 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్దాలు జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నివారిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రే చేయండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×