Rice Flour Face Pack: అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు. మరి కొందరు హోం రెమెడీస్ వాడతారు. ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఖర్చు పెరుగుతుంది. అంతే కాకుండా వీటిని రసాయనాలతో తయారు చేయడం వల్ల వచ్చే పైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది.
ఇంట్లోనే ఉండే రకరకాల పదార్థాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. ఇదిలా ఉంటే చర్మ సౌందర్యానికి బియ్యం పిండి ఎంతగానో ఉపయోగపడుతుంది. బియ్యం పిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బియ్యం పిండితో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా సహజమైన మెరుపును కూడా అందిస్తాయి. బియ్యం పిండితో తయారు చేసిన 5 ఫేస్ ప్యాక్‌లు, మీ డల్ స్కిన్‌ను అందంగా మార్చుతాయి.
బియ్యం పిండితో ఫేస్ ప్యాక్:
రైస్ ఫ్లోర్- 1 టేబుల్ స్పూన్
పసుపు ఫేస్ ప్యాక్- 1 టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకుని అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి.
పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మపు చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. బియ్యం పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా ముఖానికి తేమను కూడా అందిస్తుంది.
2. రైస్ ఫ్లోర్, అలోవెరా ఫేస్ ప్యాక్:
అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచడంలో , మచ్చలను తేలికపరచడంలో సహాయపడుతుంది.
ఎలా తయారు చేయాలి: ఈ ప్యాక్ తయారు చేయడానికి 2 స్పూన్ల బియ్యప్పిండిని తీసుకుని, అందులో అలోవెరా జెల్ కలపాలి. తర్వాత రెండు పదార్థాలను మిక్స్ చేసి మందపాటి పేస్ట్ సిద్ధం చేయండి. ఇలా తయారు చేసిన ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: అల్లంతో అద్భుతాలు.. ఇలా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అస్సలు రావు
3. రైస్ ఫ్లోర్, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్:
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేసి తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. బియ్యం పిండి మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఎలా తయారు చేయాలి: గ్రీన్ టీని మరిగించి చల్లార్చాలి. దానికి 2 చెంచాల బియ్యప్పిండి వేసి నిదానంగా కలుపుతూ పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను స్మూత్ గా , క్రీమీలాగా ఉండాలి, తద్వారా దీనిని ముఖంపై సులభంగా అప్లై చేయవచ్చు.
ప్రయోజనం: ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మాన్ని సమతుల్యం చేస్తుంది. చర్మాన్ని రిలాక్స్ చేస్తుంది మరియు డల్‌నెస్‌ని తొలగిస్తుంది.