Beauty Tips For Face: ముఖం అందంగా, ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేస్తున్నారు. దీనికి పొల్యూషన్, ఒత్తిడి, జంక్ ఫుడ్స్ తినడం వల్ల చర్మ ఈ సమస్యలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా ఉండాలంటే.. రెగ్యులర్‌గా స్కిన్‌కేర్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే.
అలా అని బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్, వేలకు వేలు ఖర్చు చేసి కొనకండి. అవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో ఫేస్ మాస్క్‌లు ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖం కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవ్వారంటే.. ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
పసుపు
తేనె
చిన్న టమాటా
టీ స్పూన్ నిమ్మరసం
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం..
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పసుపు, టీ స్పూన్ తేనె, నిమ్మరసం, టమోటా గుజ్జు, కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి ట్రై చేయండి. క్రమంగా ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోయి కాంతి వంతంగా మెరుస్తుంది.
స్కిన్ గ్లో, మచ్చలు తొలగిపోవడం కోసం మరొక చిట్కా..
కావాల్సిన పదార్ధాలు..
అలోవెరా జెల్
కలబంద
రోజ్ వాటర్
విటమిన్ ఇ క్యాప్సూల్స్
తయారు చేసే విధానం..
ఒక చిన్న బౌల్‌లో నాలుగు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి అందులో అలోవెరా జెల్, టీ స్పూన్ రోజ్ వాటర్, కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసి.. అరగంట తర్వాత ఫేష్ వాష్ చేసుకోండి. ఇలా రోజూ చేస్తే.. మీ ముఖం మిలమిల మెరిసిపోతుంది. చాలా అందంగా కనపిస్తారు.
Also Read: ఒక్కసారి ఈ హెన్నా అప్లై చేశారంటే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు కాస్త నల్లగా మారుతుంది
బియ్యం పిండి, తేనె, రోజ్ వాటర్‌తో ఫేస్ మాస్క్
ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా చేసేందుకు ఈ ఫేస్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.