Rashmika Mandanna: ప్రస్తుతం రష్మిక మందనా అంటే పేరు కాదు.. అదొక బ్రాండ్. కన్నడలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక.. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత తన లైఫే మారిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నుండి అవకాశాలు రావడం, అక్కడ తనకు వచ్చిన ఛాన్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంతో ఇప్పుడు రష్మిక అంటే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. మామూలుగా హీరోయిన్స్‌కే ఫలానా హీరోలతో నటించాలనే కలలు ఉంటాయి. కానీ మొదటిసారి రష్మికతో నటించాలని ఉందంటూ ఒక బాలీవుడ్ యంగ్ హీరో బయటపెట్టాడు. తను నటించిన ‘పుష్ప 2’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.
కార్తిక్ కోరిక
బాలీవుడ్‌లో ప్రస్తుతం రష్మిక మందనా (Rashmika Mandanna) పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘యానిమల్’ మూవీతో బీ టౌన్‌లో కూడా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’.. బాలీవుడ్‌లో రష్మికకు మొదటి సినిమానే అయినా దానివల్ల తనకు ఎనలేని పాపులారిటీ లభించింది. దీంతో హిందీలో తనకు మరెన్నో ఆఫర్లు వచ్చాయి. అలా ప్రస్తుతం బీ టౌన్ అంతా తన పేరు మారుమోగిపోతోంది. తాజాగా అల్లు అర్జున్‌తో తను కలిసి నటించిన ‘పుష్ఫ 2’ కూడా నార్త్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో రష్మికపై ఒక యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ మనసు పారేసుకున్నాడు.
Also Read: ‘స్పిరిట్’లో ఆ ఇద్దరు హీరోయిన్లు… ‘దేవర’ విలన్ కూడా
బాగా నటించింది
కార్తిక్ ఆర్యన్ (Kartik Aryan) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్, ఆలియా భట్, రష్మిక మందనాలో తనకు ఏ హీరోయిన్‌తో కలిసి పనిచేయాలని ఉంది అని అడగగా.. ‘‘అందరితో కలిసి పనిచేయాలని ఉంది. నేను అందులో ఎవ్వరితో కూడా పూర్తి సినిమా చేయలేదు. కానీ ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలంటే నేను రష్మిక మందనా అంటాను. తను పుష్పలో చాలా బాగా నటించింది’’ అని చెప్పుకొచ్చాడు కార్తిక్. దీంతో బాలీవుడ్ హీరోలు సైతం రష్మికతో నటించడానికి కలలు కంటున్నారంటూ తన ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా ఈ ముద్దుగుమ్మకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందని తెలుస్తోంది.
చేతినిండా సినిమాలు
ప్రస్తుతం రష్మిక మందనా చేతిలో దాదాపుగా ఎనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా తెలుగు, హిందీ సినిమాలే ఉన్నాయి. బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్స్‌లో రష్మిక భాగమయ్యింది. ఇప్పటికే విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఛావా’లో తనే హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో పాటు బాలీవుడ్ ఫేమస్ హారర్ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా రష్మిక చోటు దక్కించుకుంది. మరోవైపు తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. అలా ఇతర హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వకుండా రష్మిక దూసుకుపోతోంది.