BigTV English

Pimples: ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వాడితే.. ముఖంపై మొటిమలు మాయం !

Pimples: ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వాడితే.. ముఖంపై మొటిమలు మాయం !

Pimples: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇదిలా ఉంటే మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. లైఫ్ స్టైల్ లో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల కూడా మొటిమలు కొంత వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అంతే కాకుండా కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ వాడితే కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వాడితే మొటిమలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫేస్ ప్యాక్:
కావాల్సిన పదార్థాలు:
1 టీస్పూన్- స్వచ్ఛమైన పసుపు పొడి
1 టీస్పూన్- స్వచ్ఛమైన తేనె
నిమ్మరసం- 1-2 చుక్కలు

ప్యాక్ తయారు చేసే విధానం:
ఈ మూడు పదార్థాలను ఉపయోగించడం ద్వారా.. మీరు మొటిమలను తక్షణమే మాయమయ్యేలా చేయవచ్చు. దీని కోసం.. మీరు ఒక ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో పసుపు, తేనెను వేసి బాగా కలపండి. మీ చర్మం చాలా జిడ్డుగా ఉంటే.. మీరు దానికి 1-2 చుక్కల నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.


దీన్ని ఎలా ఉపయోగించాలి:
ఇప్పుడు ఈ ప్యాక్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో , ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి తొలగిపోతుంది. మురికిగా ఉన్న ముఖంపై ఎలాంటి ప్యాక్‌ను అప్లై చేసినా ఫలితం ఉండదు.

ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత.. తయారుచేసిన పేస్ట్‌ను ముఖం మొత్తం.. వేళ్లతో లేదా బ్రష్‌తో మొటిమలపై మాత్రమే అప్లై చేయండి. ముఖం మీద 15-20 నిమిషాలు ఆరనివ్వండి. దీని తర్వాత.. మీ ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ మొటిమలను చాలా వరకు తగ్గిస్తుంది.

Also Read: ఈ ఒక్క హోం రెమెడీ వాడితే.. ముఖంపై మొటిమలు మాయం ! 

ప్రయోజనాలు:
ప్యాక్‌లో ఉపయోగించే పసుపులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండటం వలన మొటిమల బాక్టీరియాను చంపుతుంది.
ఇందులో ఉపయోగించే తేనె చర్మాన్ని హైడ్రేట్ చేసి మంటను తగ్గించే సహజ మాయిశ్చరైజర్.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మం నుంచి అదనపు నూనెను తొలగిస్తుంది. అంతే కాకుండా మచ్చలను తేలికపరుస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి :
మీరు ఈ ప్యాక్ వాడుతుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. కొన్నిసార్లు ఫేస్ ప్యాక్‌లు ప్రజల చర్మానికి సరిపోవు. మొటిమలు చాలా ఎక్కువగా ఉంటే.. హోం రెమెడీస్ ప్రయత్నించే బదులు,డాక్టర్‌ను సంప్రదించండి.

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×