Brahmanda: మొట్టమొదటిసారి ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాండ. సీనియర్ నటీమణి ఆమని (Amani) ప్రధాన పాత్రలో మమత ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా రాంబాబు తొలిసారిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండీ ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు తెలంగాణ నేపథ్యంలో సాగే భావోద్వేగ భరితమైన సినిమా ఇది అని, ఈ సినిమా హీరో బన్నీరాజు తెలిపారు. అంతేకాదు డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది అని స్పష్టం చేశారు.
బ్రహ్మాండ నుండి లిరికల్ సాంగ్ అవుట్..
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా నుండి ‘
ఏమైనాదే పిల్ల’ అంటూ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం యూట్యూబ్లో అత్యంత ఆదరణ పొందుతున్న సాంగ్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. “ఏమైనాదే పిల్ల ఏమైనాదే.. ఏమైనాదే.. నీ మీదకే గాలి మళ్లిందే.. మరి ఏమైనాదే..” అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.ఒకరకంగా చెప్పాలి అంటే యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు.
ట్రెండింగ్ లో నిలిచిన ఏమైనాదే పిల్ల..
అటు లిరికల్ సాంగే కాదు ఇటు విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.అటు నటీనటుల పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ సింగర్ వరికప్పుల యాదగిరి మ్యూజిక్ అందించి ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఫిమేల్ లీడ్ కి శ్రీయా మాధురి తన అద్భుతమైన స్వరాన్ని వినిపించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ పాటకు లిరిక్స్ అందించింది కూడా వరి కప్పుల యాదగిరి కావడం గమనార్హం. కళాధర్ అందించిన కొరియోగ్రఫీ మరింత హైలెట్గా నిలిచింది.
బ్రహ్మాండ సినిమా విశేషాలు..
ఇక బ్రహ్మాండ సినిమా విషయానికి వస్తే.. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం.. ఒగ్గు అంటే శివుని చేతిలోనే ఢమరుకం అని అర్థం వస్తుంది. ఈ పదం కేవలం ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీ పదం అని కూడా చెప్పవచ్చు. ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది అని, యాక్షన్ తో పాటు డివోషనల్ థ్రిల్లింగ్ అంశాలకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో ఆమని, జయరాం, కొమరం బన్నీ రాజ్ , జోగిని శ్యామల, విజయ రంగరాజు, కనిక వాద్య, ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, చత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్, మీసం సురేష్, దేవి శ్రీ, ఐడ్ల మధుసూదన్ రెడ్డి, అనంత కిషోర్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.