BigTV English

Beauty Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Beauty Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

Beauty Tips for Glowing Skin: ముఖం కాంతివంతంగా మెరవాలని, అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. మెరిసే చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వీటిని రెగ్యులర్ గా వాడటం మీ ఫేస్‌ని డ్యామేజ్ చేయడమే కాకుండా, చిన్న ఏజ్ లోనే  వయసుపైబడిన వారిలా కనిపిస్తారు. అందుకే బయట ప్రొడక్ట్స్ కొనడం ఆపేసి.. ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే నాచురల్ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడం వల్ల మీ ముఖం కాంతివంతంగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. బ్యూటీ టిప్స్ పాటించడంతో పాటు.. పోషకాహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


ముఖంపై మచ్చలు తొలగిపోవడానికి: 

ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు టీ స్పూన్ లు కాఫీపొడి, ఒక చెంచా శెనగ పిండి, చిటెకెడు పసుపు, ఒక చెంచా తేనె, చెంచా పెరుగు. వీటిని బాగా మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేయాలి. 10-15 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.


గ్లోయింగ్ స్కిన్ కోసం: 

ఒక బౌల్ లో రెండు టీ స్పూన్‌లు శెనగ పిండి, రోజ్ వాటర్, చిటికెడు గంధం పొడి, కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాలు తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

చర్మ సమస్యలు తొలగిపోవాడినికి కొన్ని చిట్కాలు: 

చర్మం సంరక్షణకు పటిక చాలా మంచిది. స్నానం చేసే ముందు నీటిలో పటిక వేసి ఐదు నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత  స్నానం చేయండి.  చర్మ సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు వేప ఆకులను కూడా ఉపయోగించ వచ్చు చర్మ సంరక్షణకు దివ్యౌషదంగా పని చేస్తుంది.

Also Read: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

ముఖం శుభ్రంగా ఉండడానికి: 

చిన్న గిన్నెలో రెండు చెంచాల పాలు, టీస్పూన్ తేనె, టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించండి. 10- 15 నిమిషాలు అలానే ఉంచి గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మట్టి తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

మెరిసే చర్మం కోసం టొమాటో ఫేస్ ప్యాక్: 

ఒక చిన్న టొమాటో తీసుకుని దాని సగం భాగం కట్ చేసి దానిపై టీస్పూన్ చక్కెర , టీస్పూన్ తేనె వేసి ముఖంపై 20 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మీ ముఖం మిల మిల మెరిసిపోతుంది.

ఫేస్ షైనింగ్ కోసం: 

దోసకాయ రసాన్ని, కలబంద రసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖంపై అప్లై చేయండి. కాస్త ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. మీ ముఖం చాలా షైనింగ్ తయారవుతుంది. అలాగే రెండు స్పూన్ లు పచ్చిపాలు తీసుకొని అందులో చిటెకెడు పసుపు వేసి ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ఫేస్ షైనింగ్ అవుతుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×