Homemade Body Scrub: చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవడానికి మార్కెట్‌లో ఎన్నో రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే.. రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్‌కు బదులుగా.. ఇంట్లో సహజ పదార్థాలతో తయారు చేసుకునే బాడీ స్క్రబ్‌లు సురక్షితమైనవి. ఇవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా.. అవసరం అయిన పోషణను అందించి.. చర్మ రంగును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని తెల్లగా మార్చడానికి సహాయపడే కొన్ని ఉత్తమమైన, ఇంట్లో తయారుచేసే బాడీ స్క్రబ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాడీ స్క్రబ్‌లు చర్మం తెల్లబడటానికి ఎలా సహాయపడతాయి ?
బాడీ స్క్రబ్‌లు చర్మం పైపొరలోని నిర్జీవ కణాలను తొలగించి, కింద ఉన్న ఆరోగ్యకరమైన, తాజాగా ఉండే చర్మాన్ని బయట వచ్చేలా చేస్తాయి. ఈ నిర్జీవ కణాలు పేరుకుపోవడం వల్ల చర్మం నిస్తేజంగా, ముదురు రంగులో కనిపిస్తుంది. ఇంటంలో తయారు చేసుకునే స్క్రబ్‌లు ఈ కణాలను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా.. ఇంట్లో తయారుచేసే స్క్రబ్‌లలో ఉపయోగించే సహజ పదార్థాలు చర్మానికి పోషణను అందించి, దాని సహజ ఛాయను మెరుగుపరుస్తాయి.
ఇంట్లో తయారుచేసే బాడీ స్క్రబ్‌లు:
1. కాఫీ , కొబ్బరి నూనె స్క్రబ్:
కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం రంగును మెరుగు పరచడమే కాకుండా, రక్త ప్రసరణను పెంచుతాయి. కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తుంది.
కావలసినవి: 2 టేబుల్‌స్పూన్లు గ్రౌండ్ కాఫీ పౌడర్, 3 టేబుల్‌స్పూన్లు కొబ్బరి నూనె.
వాడకం: ఈ రెండింటినీ బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని శరీరంపై అప్లై చేసి, సున్నితంగా వృత్తాకార కదలికలతో 5-10 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
2. శనగపిండి, పసుపుతో స్క్రబ్:
శనగపిండి సాంప్రదాయకంగా చర్మాన్ని తెల్లగా చేయడానికి ఉపయోగిస్తారు. పసుపులో యాంటీసెప్టిక్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ రంగును మెరుగుపరుస్తాయి.
కావలసినవి: 3 టేబుల్‌స్పూన్లు శనగపిండి, అర టీస్పూన్ పసుపు పొడి, సరిపడా పాలు/పెరుగు.
వాడకం: అన్నింటినీ కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను శరీరానికి అప్లై చేసి, ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ తొలగించి, నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. నిమ్మకాయ, పంచదార , తేనెలతో స్క్రబ్:
నిమ్మకాయలో విటమిన్ సి , సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి సహజ బ్లీచింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పంచదార ఎక్స్‌ఫోలియేట్‌గా, తేనె మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.
కావలసినవి: 2 టేబుల్‌స్పూన్లు పంచదార, 1 టేబుల్‌స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్‌స్పూన్ తేనె.
వాడకం: అన్నింటినీ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తడి చర్మంపై అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
Also Read: ఇలా స్కాల్ప్ మసాజ్ చేస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
4. ఓట్స్, పెరుగుతో స్క్రబ్:
ఓట్స్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. అంతే కాకుండా చికాకును తగ్గిస్తాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ ం యొక్క రంగును మెరుగుపరుస్తుంది.
కావలసినవి: 2 టేబుల్‌స్పూన్లు ఓట్స్ పౌడర్ (రుబ్బిన ఓట్స్), 3 టేబుల్‌స్పూన్లు సాదా పెరుగు.
వాడకం: ఈ రెండింటినీ బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి, సున్నితంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.