Best Oil For Hair: ఆహారంలో ఉపయోగించే వెల్లుల్లి, మీ ఆరోగ్యానికే కాదు మీ జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది.వెల్లుల్లితో తయారు చేసిన ఆయిల్ జుట్టుకు ఉపయోగించడం వల్ల వెంట్రుకలు పొడవుగాగా, మూలాల నుండి బలంగా తయారవుతాయి.
వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, దురదను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో పాటు, ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది. వెల్లుల్లి తలలో రక్త ప్రసరణను పెంచి, జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లి నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.మరి వెల్లుల్లి నూనెను ఇంట్లోనే త ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి హెయిర్ ఆయిల్ తయారీ:
కావలసినవి:
వెల్లుల్లి- 10-12
లవంగాలు- 6
కొబ్బరి, ఆలివ్, బాదం నూనె- 1 కప్పు
మెంతులు- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
వెల్లుల్లి నూనెను తయారు చేయడానికి చూర్ణం చేయండి. ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో 1 కప్పు ఆయిల్ వేసి తక్కువ మంట మీద వేడి చేయండి. నూనె వేడి అయ్యాక అందులో తరిగిన లేదా పేస్ట్ చేసిన వెల్లుల్లి ముక్కలు మెంతులను వేయాలి. వెల్లుల్లిని లేత బంగారు లేదా గోధుమ రంగు వచ్చేవరకు నూనెలో వేయించాలి. కాని వెల్లుల్లి పూర్తిగా మాడిపోకుండా జాగ్రత్త వహించండి.
వెల్లుల్లి బంగారు రంగులోకి మారినప్పుడు, పాన్ యొక్క మంటను ఆపివేసి నూనెను చల్లార్చండి. ఆయిల్ చల్లారిన తర్వాత, నూనెను శుభ్రమైన క్లాత్‌తో వడకట్టండి. తద్వారా వెల్లుల్లి ముక్కలు , మెంతులు నూనె నుండి వేరుచేయబడతాయి. ఇప్పుడు ఈ ఆయిల్‌ను గాజు సీసాలో నిల్వ చేయండి.
ఎలా ఉపయోగించాలి ?
షాంపూ చేయడానికి అరగంట ముందు ఈ వెల్లుల్లి నూనెను జుట్టుకు పట్టించండి. దీన్ని అప్లై చేయడానికి, మీ చేతులకు కొద్దిగా వెల్లుల్లి నూనెను తీసుకుని, దానితో 10-15 నిమిషాల పాటు తలకు బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై షాంపూతో వాష్ చేయండి. ఇలా వారానికి రెండుసార్లు వెల్లుల్లి నూనెను అప్లై చేయవచ్చు.
Also Read: ఇలా ఇంట్లోనే షాంపూ తయారు చేసుకుని వాడితే.. జుట్టు రాలనే రాలదు తెలుసా ?
వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య సర్వసాధారణం. గాలిలో తేమ పెరగడం, శిరోజాలపై మురికి వల్ల జుట్టు చిట్లడం సమస్య పెరుగుతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి వెల్లుల్లి నూనెను ఉపయోగించవచ్చు.ఈ నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది.ఈ ఆయిల్ తరుచుగా వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జుట్టు త్వరగా పెరుగుతుంది. అంతే కాకుండా వెల్లుల్లిలో ఉండే షోషకాలు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తాయి. వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి. హెయిర్ గ్రోత్ కోసం ఈ ఆయిల్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.