Happy Birthday Krish.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న జాగర్లమూడి క్రిష్.. ఈరోజు 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈరోజు క్రిష్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈయన తాజాగా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అంటూ ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి గమ్యం సినిమా ద్వారా అడుగుపెట్టిన క్రిష్..’ వేదం ‘, ‘ కంచె ‘, ‘ కొండపొలం’ వంటి సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘హరిహర వీరమల్లు’ సినిమాను ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమా ఆగిపోవడంతో డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక ఇప్పుడు అనుష్క శెట్టి (Anushka Shetty) తో ఘాటి (Ghaati)అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో అనుష్క ట్రైబల్ మహిళగా కనిపించబోతున్నట్లు ఇటీవలే పోస్టర్ తో సహ వెల్లడించారు. ముఖ్యంగా ఇందులో అనుష్క చాలా వైల్డ్ గా కనిపించింది. ‘ వేదం ‘ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రిపీట్ కావడంతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగింది. రీసెంట్ గా ఘాటి సినిమా షూటింగ్ ను క్రిష్ కంప్లీట్ చేశారు త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.
మళ్లీ పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్..
ఇక క్రిష్ వైవాహిక జీవితానికి వస్తే హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను క్రిష్ రెండో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈయన ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మొదటి భార్య కూడా డాక్టర్..
మరోవైపు రమ్య వెలగ అనే డాక్టర్ ను 2016లో క్రిష్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వ్యక్తిగత విభేదాల కారణంగానే విడిపోయారు. ఇక చాలా రోజుల తర్వాత డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా.. ఆమె కూడా డాక్టర్ కావడం.. పైగా ఆమె పేరు కూడా రమ్య కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ క్రిష్ బాల్యం , విద్యాభ్యాసం..
గుంటూరులో పుట్టి పెరిగారు. ఈయన తాతయ్య జాగర్లమూడి రమణయ్య. పోలీస్ అధికారి.. ఆయనకు సంతానం ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మనవళ్లు, మనవరాళ్లు అందరిలోకి కూడా క్రిష్ పెద్దవాడు కావడంతో తాత గారి దగ్గర కాస్త చనువుగా ఉండేవారట. చిన్నతనం నుంచే కథలు చదవడం, రాయడం మీద ఆసక్తి పెంచుకున్నారు క్రిష్. అదే సమయంలో క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబాకు సినిమాలంటే ఎంతో ఆసక్తి . ఒక సినిమా థియేటర్ కూడా నడిపి గిట్టుబాటు కాక ఆయన మధ్యలోనే వదిలేశాడు. అయితే క్రిష్ మాత్రం తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫార్మసీలో ఎమ్మెస్ చేయడం కోసం అమెరికా వెళ్లి , అక్కడ కూడా సినిమాలు చూడడం, పుస్తకాలు చదవడం లాంటివి చేయడంతో ఈయన సన్నిహితులు సినిమా రంగం వైపు ప్రోత్సహించారు. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు క్రిష్.