BigTV English

Kitchen Sink: కిచెన్ సింక్ మురికిగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతుంది

Kitchen Sink: కిచెన్ సింక్ మురికిగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతుంది

Kitchen Sink: కిచెన్ సింక్ ప్రతి రోజు ఉపయోగిస్తుంటారు. నిరంతర ఉపయోగం కారణంగా తరుచుగా సింక్ మురికిగా మారుతుంది. అంతే కాకుండా అప్పుడప్పుడూ సింక్‌ బ్లాక్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే సరిగ్గా శుభ్రం చేయకపోయినా కూడా ఈ సమస్య తలెత్తుతుంది.


ఇంట్లో ఉన్న మహిళలకు కిచెన్ క్లీనింగ్ అనేది పెద్ద సమస్య అనే చెప్పాలి. ముఖ్యంగా సింక్ నీట్ గా ఉండాలంటే తరుచుగా క్లీన్ చేయడంతో పాటు కొన్ని రకాల టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. ఇదిలా ఉంటే పొరపాటున కిచెన్ సింక్ బ్లాక్ అయితే మాత్రం సింక్ నుండి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. దీతో పాటు మొత్తం పని ఆగిపోతుంది.

మీరు కిచెన్ సింక్‌ను బ్లాక్ అవకుండా జాగ్రత్తపడాలంటే ముందుగా దానిని శుభ్రంగా ఉపయోగించాలి. ఇందుకోసం కొన్ని పద్ధతులను కూడా అనుసరించండి. వాటి సహాయంతో, మీరు కిచెన్ సింక్‌కు సంబంధించిన సమస్యలను సులభంగా వదిలించుకోవచ్చు.


కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి మార్గాలు:

బేకింగ్ సోడా, వెనిగర్: మురికిగా ఉన్న లేదా బ్లాక్ అయిన సింక్ ను శుభ్రం చేయాలని అనుకున్నప్పుడు ముందుగా సగం కప్పు బేకింగ్ సోడాను సింక్‌, అరకప్పు వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని సింక్ హోల్ లో పోయాలి. అంతే కాకుండా కొంత కొంత లిక్విడ్ ను సింక్ మొత్తం బ్రష్ సహాయంలో రుద్ది కాసేపే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి . బేకింగ్ సోడా , వెనిగర్ కలిసి రసాయన ప్రతిచర్యను సృష్టిస్తాయి. ఇది ధూళి , వాసనలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇలా తరుచుగా చేయడం వల్ల మీ సింక్ తెల్లగా మెరిసిపోతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయను సగానికి కట్ చేసి, రసాన్ని సింక్‌లో వేయండి. ఇది దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ ఉప్పు కలిపపిన మిశ్రమంలో బ్రష్ ఉంచి సింక్ శుభ్రం చేసినా మంచి ఫలితం ఉంటుంది.

ఉప్పు: సింక్‌లో ఉప్పు పోసి బాగా స్క్రబ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఉప్పు సహజమైన స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అంతే కాకుండా మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.

సింక్ బ్లాక్ అయితే.. ఈ చిట్కాలు పాటించండి:

మరిగే నీరు: ఒక వేళ మీ కిచెన్ లోని సింక్ బ్లాక్ అయితే గనక సింక్‌లో 2 – 3 గ్లాసుల వేడినీరు పోయాలి. ఇది సింక్ లో అడ్డంకులను తొలగిస్తుంది. సింక్ పైపులోని మురికిని అంతా క్లీన్ చేస్తుంది.

బేకింగ్ సోడా, ఉప్పు: సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, ఉప్పు తీసుకుని ఒక మిశ్రమం తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని సింక్ హోల్ లో పోయండి . కొంత సమయం తరువాత వేడి నీటిని కూడా పోయండి. ఇలా చేయడం వల్ల మురికి పూర్తిగా తొలగిపోతుంది. సింక్ క్లీన్ అవుతుంది.

వెనిగర్ , డిష్ సోప్: సమాన పరిమాణంలో వెనిగర్ , డిష్ సోప్ ఒక మిశ్రమంలాగా తయారు చేయండి.ఈ మిశ్రమాన్ని సింక్ లో పోయాలి. కొంత సమయం తరువాత, అందులోని 3-4 గ్లాసల వేడి నీటిని పోయండి. ఇలా చేస్తే సింక్ బ్లాక్ మొత్తం క్షణాల్లోనే క్లీన్ అవుతుంది.

Also Read: రాగి బాటిల్‌లోని నీళ్లు త్రాగితే ఎన్ని లాభాలో తెలుసా ?

కోట్ హ్యాంగర్: కోట్ హ్యాంగర్‌ను నేరుగా సింక్ లోని హోల్ లో వేయండి. లోపల చిక్కుకున్న జుట్టు లేదా ఇతర శిధిలాలను తొలగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

రెగ్యులర్ క్లీనింగ్: సింక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. సింక్‌లో ఎప్పుడూ నూనె లేదా కొవ్వు పదార్థాలను పోయకండి. సింక్ లో పెద్ద పదార్థాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×