Winter Hair Mask : చలికాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పని. సహజ పదార్థాలతో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ని అప్లై చేయడం ద్వారా మీరు మీ జుట్టును మెరసేలా చేసుకోవచ్చు.
శీతాకాలంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ రోజుల్లో, చుండ్రు, జుట్టు పొడిబారడం వంటివి సాధారణ సమస్యలు. మీరు సహజ పద్ధతిలోనే శీతాకాలంలో మీ జుట్టును ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవచ్చు. సహజ పదార్థాలతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌లతో జుట్టును మెరిసేలా చేసుకోవచ్చు.
చలికాలంలో జుట్టు సంరక్షణకు నేచురల్ హెయిర్ మాస్క్‌లు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి జుట్టుకు పోషణను అందించడమే కాకుండా ఎలాంటి నష్టం జరగకుండా కాపాడతాయి. అంతే కాకుండా శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం 5 సహజమైన హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసి ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ 5 హెయిర్ మాస్క్‌లు అద్భుతాలు చేస్తాయి:
1. ఎగ్, పెరుగు హెయిర్ మాస్క్:
కావలసినవి: 1- గుడ్డు, 2 – స్పూన్ల పెరుగు
తయారీ విధానం:ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు, ఎగ్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
ప్రయోజనాలు: గుడ్డు జుట్టుకు ప్రొటీన్‌ను అందిస్తుంది. అంతే కాకుండా పెరుగు జుట్టుకు తేమను ఇస్తుంది.
2. అరటిపండు , తేనె హెయిర్ మాస్క్:
కావలసినవి: 1 పండిన అరటిపండు, 1 టీస్పూన్ తేనె
తయారీ విధానం: అరటిపండును మెత్తగా చేసి దానికి తేనె కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
ప్రయోజనాలు: అరటిపండు జుట్టుకు తేమను ఇస్తుంది. అంతే కాకుండా తేనె జుట్టును మెరిసేలా చేస్తుంది.
3. అవకాడో, కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్:
కావలసినవి: సగం అవకాడో, 2 టీస్పూన్లు కొబ్బరి నూనె
తయారీ విధానం: అవకాడోను మెత్తగా చేసి అందులో కొబ్బరి నూనె వేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
ప్రయోజనాలు: అవకాడో జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె జుట్టును బలపరుస్తుంది.
4. మెంతి గింజలు, పెరుగుతో హెయిర్ మాస్క్:
కావలసినవి: మెంతి గింజలు (రాత్రిపూట నానబెట్టినవి), 2 టీస్పూన్లు పెరుగు
తయారీ విధానం: నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి, దానికి పెరుగు కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో కడగాలి.
ప్రయోజనాలు: మెంతి గింజలు జుట్టును బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా పెరుగు జుట్టుకు తేమను ఇస్తుంది.
5. గుడ్డు, నిమ్మకాయతో హెయిర్ మాస్క్:
కావలసినవి: 1 గుడ్డు, 1 టీస్పూన్ నిమ్మరసం
తయారీ విధానం: ఎగ్ లో నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
ప్రయోజనాలు: గుడ్డు జుట్టుకు ప్రొటీన్‌ను అందిస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ జుట్టును మెరిసేలా చేస్తుంది.
Also Read: చలికాలంలో ఇవి వాడితే.. మీ ముఖం మెరిసిపోతుంది
ఈ హెయిర్ మాస్క్‌లను అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి.
మీకు ఏదైనా పదార్ధానికి అలెర్జీ ఉంటే, దానిని ఉపయోగించవద్దు.
ఈ మాస్క్‌లను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా , మెరుస్తూ ఉంటుంది.
ఇతర చిట్కాలు:
శీతాకాలంలో దుమ్ము నుండి జుట్టును రక్షించండి.
ఎక్కువ సార్లు తలస్నానం చేయకండి.
దువ్వేటప్పుడు సున్నితంగా దువ్వండి.
వేడి గాలితో జుట్టు ఎండబెట్టడం మానుకోండి.