PSL – IPL: ఐపీఎల్ అనేది ఒక బిజినెస్ స్కిల్. ఇక్కడ ఫ్రాంచైజీలు గెలుపు సాధించే అబ్బాయిలను మాత్రమే ఎన్నుకుంటారు. ఎలాంటి విలువలు, ఎమోషన్లు ఉండవు. ఆటగాళ్ల గత రికార్డులు ఫ్రాంచైజీల ఓనర్లు అస్సలు పట్టించుకోరు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది మాత్రమే చూస్తారు. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ వేలంలో చాలామంది ఆటగాళ్లను పట్టించుకోలేదు. ఆటలో ఎంతో స్టామినా ఉన్నప్పటికీ ఫామ్ కనబరిచిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేశారు.
తాజాగా ముగిసిన వేలంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్లను సైతం ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశారు. అయితే వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లకు పిసిబి శుభవార్త చెప్పింది. ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు పట్టించుకోని ప్లేయర్లను ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐపీఎల్ లో పాల్గొనని ఈ స్టార్ ప్లేయర్స్ పిఎస్ఎల్ లీగ్ లో కనిపించవచ్చు. 2009లో నుంచి 2024 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఐపీఎల్ లో భాగమైన డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు.
వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపించలేదు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ పిఎస్ఎల్ లో ఆడే అవకాశం ఉంది. మెగా వేలంలో కేన్ విలియమ్సన్ కూడా అమ్ముడు పోలేదు. ఐపీఎల్ లో అతని సేవలు ఉపయోగించుకున్న జట్లు ఇప్పుడు అతడిని గాలికి వదిలేసాయి. కేన్ విలియంసన్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ గా నిలిచింది. అయితే సన్రైజర్స్ విడుదల చేయడంతో గత రెండు సీజన్లుగా గుజరాత్ తరపున ఆడాడు. ఇప్పుడు విలియంసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడనున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్ షైహోప్ కూడా అమ్ముడుపోలేదు.
అతడు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. పిఎస్ఎల్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వే వెటరన్ ఆల్ రౌండర్ సికిందర్ రజా కూడా వేలంలో అమ్ముడుపోలేదు. ఇతను కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే అవకాశం ఉంది. అలాగే వేలంలో అమ్ముడు పోనీ బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిస్ రెహ్మాన్ కూడా పిఎస్ఎల్ లీగ్ లో భాగం కానున్నాడు. అతను గత సీజన్ లో సీఎస్కే తరఫున ఆడాడు.
ఇదిలా ఉండగా…. ఐపిఎల్ వేలాన్ని విదేశాలలో నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని స్పూర్తిగా తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ వేలాన్ని లండన్ లేదా దుబాయ్ లో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది. గత సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ పిఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవడం ఇది మూడవసారి. టైటిల్ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వాన్ సారధ్యంలోని ముల్తాన్ సుల్తాన్ రెండు వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Also Read: Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ !