BigTV English

Tea: టీ తాగుతూ స్పైసీ ఫుడ్స్‌ను మధ్య మధ్యలో తింటున్నారా? ఇక అంతే సంగతులు

Tea: టీ తాగుతూ స్పైసీ ఫుడ్స్‌ను మధ్య మధ్యలో తింటున్నారా? ఇక అంతే సంగతులు

టీ అంటే ఎంతో మందికి ప్రాణం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే పానీయాలలో టీ ఒకటి. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన టీ ఉంటుంది. భారత దేశంలో టీతో పాటు అనేక రకాల ఆహారాలను కూడా పక్కన పెట్టుకొని తింటూ ఉంటారు. పకోడీలు, సమోసాలు, బిస్కెట్లు ఇలా ఎన్నో రకాల చిరుతిళ్లు ఉంటాయి. కొంతమంది స్పైసీగా పకోడీలను, సమోసాలను తయారు చేసుకుంటారు. టీతోపాటు కారంగా ఉండే ఆహారాలను తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.


ఎంతోమందికి టీ తాగుతూ స్పైసీ స్నాక్స్ తింటూ ఉంటే మజాగా ఉంటుంది. కానీ రుచి గురించి మాత్రమే ఆలోచించడం కాదు, ఆ రెండింటి కాంబినేషన్ వల్ల మీ శరీరం ఎలా స్పందిస్తోందో కూడా ఆలోచించాలి. మసాలాలు అధికంగా ఉండే వంటకాలతో టీ ని కలిపి తాగడం అంత మంచి ఎంపిక కాదు. అది జీర్ణ సమస్యలకు మరెన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది.

కారంగా ఉండే ఆహారాలు ఎంతోమందిలో యాసిడ్ రిఫ్లెక్స్ కు, గుండెల్లో మంటకు కారణం అవుతాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. డయేరియా వంటి సమస్యలు కూడా రావచ్చు. ఛాతీ లేదా గొంతులో మంటగా అనిపిస్తుంది. ఇక ఆ స్పైసీ ఫుడ్స్ తింటూ టీ తాగుతూ ఉంటే ఆ టీలో టానిన్లు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు కలిసి పొట్ట పై ఉన్న లైనింగ్ ను చికాకు పరుస్తాయి. స్పైసీ ఫుడ్స్ తో పాటు టీ తాగితే పొట్టలో మరింత గడబిడగా అనిపిస్తుంది. యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువైపోతుంది. కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది. ఈ స్పైసీ ఫుడ్స్ వల్ల మరింత అసౌకర్యం కలుగుతుంది.


టీలలో కెఫిన్ అధికంగానే ఉంటుంది. మీరు బ్లాక్ టీ తాగినా, గ్రీన్ టీ తాగినా కూడా అందులో కొంత మొత్తంలో కెఫిన్ కచ్చితంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను చికాకు పెట్టే పదార్థమే. కెఫిన్ పొట్టలో చేరాక అక్కడ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఇది స్పైసీ ఫుడ్స్ తో కలిస్తే సమస్య పెద్దగా మారుతుంది. మిరపకాయలు వంటి వాటిలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఎక్కువైతే పొట్ట లైనింగ్ దెబ్బతింటుంది. విరేచనాలు కూడా అవుతాయి. సున్నితమైన పొట్ట లైనింగ్ ఉన్నవారు అల్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే పొట్టలో ఉబ్బరం, పొట్టనొప్పి, అసౌకర్యం వంటివి కూడా పెరిగిపోతాయి. దీన్ని తాగేటప్పుడు వీలైనంతవరకు ఎలాంటి ఆహారాన్ని తినకుండా ఉండడమే ఉత్తమం.

టీ లో అనేక రకాల టానిన్లు ఉంటాయి. ఇవి స్పైసీ ఫుడ్స్ తింటున్నప్పుడు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. ఈ సమ్మేళనాలు, ప్రోటీన్లు, ఇనుము వంటి ఖనిజాలను శరీరం శోషించుకోకుండా బంధిస్తాయి. స్పైసీ ఫుడ్స్ జీవక్రియకు సహాయపడే పదార్థాలను కలిగి ఉంటాయి. కానీ టీతో కలిపి తాగడం వల్ల టీలో ఉండే టానిన్లు ఆ పోషకాలను శోషించుకోకుండా అడ్డుకుంటాయి.

స్పైసీ ఫుడ్స్ లో క్యాప్సైసిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది నోటిలో మంటను పెంచేస్తుంది. ఆ నోటిలో మంట తగ్గించేందుకు పెరుగు ఉపయోగపడుతుంది. కానీ టీ ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. నోరు మండుతున్నప్పుడు దీన్ని తాగడం వల్ల ఆ మంట మరింతగా పెరిగిపోతుంది. దీనివల్ల నోటిలోని శ్లేష్మ పొరలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. నోటిలో అల్సర్లు కూడా రావచ్చు.

Also Read: చలికాలంలో రాత్రి పూట బెల్లం పాలు త్రాగితే.. మతిపోయే లాభాలు

టీ తాగడం వల్ల కొన్నిసార్లు పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, వికారం వంటివి వస్తాయి. ఖాళీ పొట్టతో టీ ని తాగకూడదు. ఆహారంలో వెల్లుల్లి, మిరపకాయలు ఎక్కువైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి టీ తాగేటప్పుడు స్పైసి ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×