Henna For Hair: ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో పాటు.. జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందుకు దుమ్మూ, కాలుష్యం, పోషకాహారం తినకపోవడం, స్ట్రెస్, కంటినిండా నిద్ర లేకపోవడం.. ఇతర కారణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే.. జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు డైట్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అయితే చాలా మంది జుట్టు పెరగటం కోసం, దీంతో పాటు తెల్ల జుట్టు నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
రకరకాల హెన్నాలు, బయట మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎలాంటి ఖర్చు లేకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ వంటివి రాకుండా ఉండాలంటే ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాలిసిన పదార్ధాలు..
మందారం ఆకులు
కలబంద
మెంతులు
గోరింటాకు పొడి
తయారు చేసుకునే విధానం..
ముందుగా మందార పువ్వులను శుభ్రంగా నీటితో కడిగి.. వీటిని మిక్సీజార్ లోకి తీసుకుని.. అందులో అరగ్లాసు నీళ్లు పోయాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. అదే మిక్సీజార్‌లో కలబందను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ముందుగా నానబెట్టిన మెంతి గింజలను వేసి.. మెత్తగా పేస్ట్ లాగే చేయండి. తయారు చేసుకున్న ఈ రెండు మిశ్రమాలను ఒక గిన్నెలో తీసుకుని అందులో గోరింటాకు పొడి, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు, మూడు సార్లు చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు.. తెల్ల జుట్టును శాశ్వతంగా నివారిస్తుంది. అలాగే చుండ్రు సమస్యలను తొలగిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
జుట్టు ఒత్తుగా, సిల్కీగా కావాలనుకుంటున్నారా.. అయితే ఈ ఈ చిట్కా పాటించండి. వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.
కావాల్సిన పదార్ధాలు..
మందారం ఆకులు
మందారం పువ్వులు
మెంతులు
అవిసెగింజలు
విటమిన్ ఇ క్యాప్సూల్స్
ఒక గ్లాసు వాటర్
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి.. అందులో ఒక గ్లాసు వాటర్, 10 మందారం ఆకులు, నాలుగు మందారం పువ్వులు, రెండు టేబుల్ స్పూన్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్ అవిసెగింజలు వేసి 15 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని వేరే బౌల్‌లో వడకట్టండి. అందులో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి మిక్స్ చేయండి. దీన్ని జుట్టు చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు నివారించడంతో పాటు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.