Bengal Cricketer Suvojit Banerjee: క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో మాజీ క్రికెటర్ మరణించారు. గత కొన్ని రోజులుగా…. చాలామందికి గుండెపోట్లు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎక్కువగా.. గుండెపోటు వచ్చి… మరణిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యంగ్ స్టార్స్ గుండెపోటుకు గురవుతున్నట్లు నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మాజీ క్రికెటర్…. గుండెపోటుతో ( Heart Attach ) మరణించారు.
Also Read: Vinod Kambli’s Health: క్రిటికల్ గా టీమిండియా క్రికెటర్.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్!
పశ్చిమ బెంగాల్ కు ( Bengal ) చెందిన మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) గుండెపోటుతో మరణించడం జరిగింది. 39 సంవత్సరాలు ఉన్న… బెంగాల్ మాజీ క్రికెటర్ బెనర్జీ… ఉన్నట్టుండి కుప్పకూలారట. తన ఇంట్లోనే… ఏదో చిన్న పని చేస్తుంటే సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) కి గుండెపోటు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే గుండెపోటు రాగానే… వెంటనే కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యారు.
అనంతరం ఆసుపత్రికి కూడా తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లే సమయానికి సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) మరణించారట. ఈ విషయాన్ని ఆసుపత్రి బృందాలు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. దీంతో బెంగాల్ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) మృతి పట్ల… లోకల్ క్రికెటర్లందరూ సంతాపం తెలుపుతున్నారు. ఓ మంచి క్రికెటర్ ను కోల్పోయామని… ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Champions Trophy 2025: టీమిండియా జట్టు ప్రకటన.. రంగంలోకి కొత్త ప్లేయర్లు?
ఇది ఇలా ఉండగా… గుండెపోటుతో మరణించిన సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) …. మూడు రంజీ మ్యాచ్ లు ఆడాడట. 2014లో ఒడిషాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేశాడు బెనర్జీ. ఆ సీజన్‌లో మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. అలాగే నాలుగు… లిస్ట్ – A మ్యాచ్లు ఆడినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం… రంజిత్ ట్రోఫీలకు దూరంగా ఉంటున్న బెనర్జీ… చిన్నచిన్న టోర్నీలలో మాత్రమే ఆడుతున్నాడట. రెగ్యులర్ క్రికెట్కు దూరంగా ఉంటూ… అప్పుడప్పుడు మాత్రమే ఆడేందుకు ఆసక్తి చూపించేవాడట సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) .
ఇక సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) మృతితో ఆయన కుటుంబం.. తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. కుటుంబాన్ని మొత్తం ఆర్థికంగా… చూసుకునే బెనర్జీ ఇప్పుడు లేకపోవడంతో… ఆ కుటుంబం పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. తమ బతుకులను… దేవుడు ఆగం చేసి వెళ్లిపోయాడని… బాధిత కుటుంబం… విచారం వ్యక్తం చేస్తుంది.
ఇక పశ్చిమ బెంగాల్ కు ( Bengal ) చెందిన మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) మరణంపై ప్రస్తుత బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా స్పందించారు. “మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) ఒక టీమ్‌మెన్ అని… మనోహరమైన కుర్రాడు” అని తెలిపారు. “దేశవాళీ క్రికెట్‌లో మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ ( Suvojit Banerjee ) ప్రదర్శన అప్పట్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. బెంగాల్ జట్టులో అతను కీలక ప్లేయర్” అని శుక్లా పేర్కొన్నారు.