BigTV English

Self Help Groups: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు 10 లక్షలు

Self Help Groups: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు 10 లక్షలు

Self Help Groups: మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది. గతేడాది మృతులైన వారికి కుటుంబాలకు 38.5 కోట్ల పరిహారం చెల్లించనుంది. దీనికి రేవంత్ కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తోంది. పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాలు(SHG) సభ్యులకు ఆర్ఠిక సాయం అందజేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వం నుంచే నేరుగా రూ.10 లక్షల పరిహారం బాధిత కుటుంబాలకు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీ లేకున్నా డబ్బును అందజేయనుంది. గతంలో బీమా కంపెనీల ద్వారా చెల్లించేవారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు నేరుగా నిధులు అందజేయనుంది.


ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బాధిత కుటుంబాలకు బాసట దొరకనుంది. గత ఏడాది 385 మంది మృతువాతపడ్డారు. వారికి రూ.38.5 కోట్ల పరిహారం ఇవ్వనుంది. దీనికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. త్వరలో మహళల కుటుంబాలకు డబ్బులను అందజేయనుంది.

ALSO READ: ప్రభుత్వం ఆఫీసులో రాసలీలలు.. లిప్‌లాక్ తర్వాత రెచ్చిపోయారు

ఇదిలా ఉండగా మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు జారీ కోసం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. దీనివల్ల ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేయనుంది. అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించే దిశగా అడుగులు వేయనుంది.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×