Skin Care: చలికాలంలో చర్మం పూర్తిగా పొడిబారుతుంది. తరచుగా, అమ్మాయిలు పొడి చర్మం నివారించేందుకు వివిధ చర్మ సంరక్షణ ఉత్పత్తులు, హోం రెమెడీస్ ప్రయత్నిస్తుంటారు. ఉదయం పూట ముఖం కడుక్కుంటే.. కొంత మంది చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది.
మీరు మీ చర్మంలోని సహజ నూనెను కోల్పోకూడదనుకుంటే, మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవాలనుకుంటే, ఫేస్ వాష్ కోసం ఏదైనా రసాయన ఉత్పత్తులను ఉపయోగించకుండా, ఇంట్లో తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించండి. మరి ఈ ఫేస్ ప్యాక్ లు ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగపడతాయి. వీటిని తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బయట మార్కెట్ లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ రసాయనాలతో తయారు చేస్తారు. వీటిని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని పదార్థాలతో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం మంచిది. ఫేస్ ప్యాక్ లు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని వాడటం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది.
బియ్యం పిండి, పసుపు పొడి, పెరుగుతో ఫేస్ ప్యాక్ :
మిక్సీ జార్‌లో బియ్యాన్ని బాగా గ్రైండ్ చేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. తర్వాత దీంట్లో పసుపు వేసి మిక్స్ చేయండి. కాస్త పెరుగు వేసి కూడా ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.
రోజు ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి:
రోజూ రైస్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం చాలా సులభం. రోజువారీ ఫేస్ వాష్ వాడే బదులు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని ముఖం కడుక్కుంటే.. కొన్ని రోజుల్లోనే చర్మంపై ప్రభావం కనిపిస్తుంది. ముఖం తెల్లగా మెరుస్తుంది. అంతే కాకుండా ముఖం మృదువుగా తయారవుతుంది.
చర్మం మెరిసేలా, తేమగా మారుతుంది:
మీ ముఖ చర్మం దాని సహజ నూనెను కోల్పోతుంటే, పెరుగు ఉత్తమ మాయిశ్చరైజర్. దీని సహాయంతో చర్మం మృదువుగా మారడమే కాకుండా సహజంగా తేమగా మారుతుంది. దీంతో పాటు, బియ్యం పిండి చర్మానికి మెరుపును అందించడానికి , మృత చర్మాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. స్నానం చేసే ముందు ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. తర్వాత తేలికగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం పూర్తిగా క్లీన్‌గా మారి మెరుస్తూ ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.