OTT Movie : రొమాంటిక్ సినిమాలను చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులోనూ హాలీవుడ్ సినిమాలంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అటువంటి రొమాంటిక్ కంటెంట్ ఉన్న ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘క్రూయెల్ ఇంటెన్షన్స్‘ (Cruel Intentions). ఈ మూవీకి రోజర్ కుంబ్లే దర్శకత్వం వహించారు. ఇందులో సారా మిచెల్ గెల్లార్, ర్యాన్ ఫిలిప్, రీస్ విథర్‌స్పూన్, సెల్మా బ్లెయిర్ నటించారు. న్యూయార్క్ నగరంలో ఒక ధనిక పాఠశాలలో జరిగే రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రీకరించారు. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
శభాష్టియన్ మంచి మ్యాటర్ ఉన్న టీనేజ్ కుర్రాడు. ఇతనికి సవతి తల్లి కూతురు కేథరిన్ ఒక ఛాలెంజ్ విసురుతుంది. అదేమిటంటే కేథరిన్ కి సిసిల్ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఏకాంతంగా గడిపితే, నాతో కూడా ఆ పని చేసే అవకాశం ఇస్తాను అని చెప్తుంది. అయితే శభాష్టియన్ కి తన క్లాస్మేట్ అయిన అమిత అనే అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది. అమిత సెబాష్టియన్ ని పెద్దగా పట్టించుకోదు. అతని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. మరోవైపు సిసిల్ తన టీచర్తో ఆ పని చేయడానికి చూస్తూ ఉంటుంది. కేథరిన్ ఈ విషయం సిసిల్ తల్లికి చెప్తుంది. ఆ తరువాత టీచర్ కి దూరంగా ఉంచుతుంది సిసిల్ తల్లి. అమిత, శభాష్టియన్ను ఇష్టపడకపోవడంతో, కేథరిన్ వేసిన ఛాలెంజ్ కి శభాష్టియన్ ఒప్పుకుంటాడు. సిసిల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళతాడు. అయితే అతని మనసులో అమిత ఉండటంతో ఆ పని చేయలేక పోతాడు. ఎంతోమందితో ఏకాంతంగా గడిపిన శభాష్టియన్ అమితనే సీరియస్ గా లవ్ చేస్తాడు.
ఒకరోజు కేథరిన్ తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సౌండ్స్ బయటికి రావడంతో ఇంట్లోకి వెళ్లి చూస్తాడు శభాష్టియన్. అతనిని మంచం కింద దాచిపెడుతుంది కేథరిన్. నేను ఇప్పుడు ఆ పని చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ కేథరిన్ దగ్గరికి వస్తాడు శభాష్టియన్. ఓడిపోయిన వాళ్ళతో నేను ఆ పని చేయలేనని చెప్తుంది కేథరిన్. చివరికి తన విషయాలను ఒక డైరీలో రాసి అమితకి ఇస్తాడు. రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా అమితని తప్పించబోయి కారు కింద పడిపోతాడు. చివరికి యాక్సిడెంట్ తర్వాత శభాష్టియన్ ఏమవుతాడు? అమిత, శభాష్టియన్ ని ఇష్టపడుతుందా? కేథరిన్ వేసిన ఛాలెంజ్ ఏమవుతుంది. అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘క్రూయెల్ ఇంటెన్షన్స్’ (Cruel Intentions) అనే రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడండి.