Spray For White Hair: ఈ రోజుల్లో ఇంటి నుండి అడుగు బయటకు పెడితే చాలు జుట్టుపై దుమ్ము, దూళి పేరుకుపోతాయి . ఇవి మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. మన చర్మం, జుట్టును కూడా దెబ్బతీస్తాయి. మనం ఎక్కడికైనా బయటకు వెళుతుంటే మన చర్మంపై మాత్రమే కాకుండా, మన జుట్టు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
పెరుగుతున్న కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య పెరుగుతోంది. అంతే కాకుండా జుట్టు రాలడం అనే సమస్య ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యల నుండి బయటపడటానికి కొన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య తగ్గడానికి అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారించడానికి హోం మేడ్ హెయిర్ స్ప్రే తయారు చేసుకుని వాడవచ్చు. దీనిని తరచగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెయిర్ స్ప్రే ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు లవంగాల స్ప్రే:
చర్మం లాగే.. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో అనేక రకాల సీరమ్‌లు, స్ప్రేలు, ఆయిల్‌లు, మాస్క్‌లు, షాంపూలు, కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నింటిని రసాయనాలతో తయారు చేస్తారు. మీరు మీ జుట్టు ఆరోగ్యాన్ని సహజ పద్ధతిలో కాపాడుకోవాలనుకుంటే.. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలంటే మీరు లవంగం స్ప్రేని ఉపయోగించవచ్చు. లవంగం యాంటీ బాక్టీరియల్ , యాంటీఆక్సిడెంట్ మూలకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది జుట్టును పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జట్టును బలంగా చేయడంలో కూడా మేలు చేస్తుంది.
స్ప్రే ఎలా తయారు చేయాలి ?
ఈ స్ప్రే తయారు చేయడానికి.. మీరు 10 లవంగాలను తీసుకుని కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత.. చల్లబరచడానికి పక్కన పెట్టుకోండి. అనంతరం ఈ నీటిని వడకట్టి ఒక సీసాలో స్టోర్ చేయండి.
ఎలా ఉపయోగించాలి ?
మీరు ఈ లవంగం స్ప్రేను ప్రతిరోజూ మీ జుట్టుకు ఉపయోగించవచ్చు. తక్కువ రోజుల్లోనే మంచి రిజల్ట్ పొందడానికి.. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం మంచిది. మీరు చేయాల్సిందల్లా జుట్టుకు దీనిని స్ప్రే చేసుకోవడమే. దీనివల్ల జుట్టు మెరుపు కూడా పెరుగుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం సమస్య నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇప్పటివరకు మీరు లవంగాలను వంటకాల తయారీలో మాత్రమే ఉపయోగించి ఉంటారు కానీ ఇవి మీ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసా ? ఇందులో యూజినాల్ అనే ప్రత్యేక మూలకం ఉంటుంది. ఇది తలపై రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. తెల్ల జుట్టు సమస్య నుండి పూర్తిగా ఉపశమనం అందిస్తుంది.
Also Read: ఇంట్లోనే.. సన్ స్క్రీన్ తయారు చేసుకుందామా ?
ఇలా ఉపయోగించండి ?
లవంగం స్ప్రేలా కాకుండా.. మీరు దానిని కొబ్బరి నూనెతో కలిపి కూడా మీ జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
మీరు పెరుగులో లవంగాలను కలిపి హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది తల చర్మాన్ని చల్లబరుస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.