Homemade Sunscreen: వేసవి కాలంలో.. చెమట కారణంగా మొటిమలు, మచ్చల సమస్య పెరుగుతుంది. మారుతున్న సీజన్ ప్రకారం మన ముఖానికి వివిధ పోషకాలు అవసరం. సమ్మర్‌లో వాడే కొన్నిరకాల మాయిశ్చరైజర్లు లేదా ఫేస్ క్రీములు ముఖంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. ఇదిలా ఉంటే చాలా మంది సమ్మర్ లో వచ్చే చర్మ సమస్యలను వదిలించుకోవడానికి అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు.
మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి మన ముఖానికి ప్రయోజనాలను అందిచడంతో పాటు హానిని కూడా కలిగిస్తాయి. కొన్నిసార్లు వీటిని వాడటం వల్ల ముఖంపై అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతి ఒక్కరూ తమ చర్మ రకం ఏమిటో తెలుసుకోవాలి . దీని ప్రకారం.. ఇంట్లోనే సన్‌స్క్రీన్ తయారు చేసుకుని ఉపయోగించాలి. ఈ ఇంట్లో తయారుచేసిన సన్‌స్క్రీన్ పేస్ట్ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. అంతే కాకుండా మొటిమల సమస్యను తొలగిస్తుంది
DIY సన్‌స్క్రీన్:
వేసవిలో చర్మ సంరక్షణ కోసం అలోవెరా జెల్ ఉపయోగించడం చాలా మంచిది. చర్మ సంబంధిత అనేక సమస్యలను తొలగించడంలో కలబంద చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ముఖంపై ట్యాన్ తొలగించడానికి మీరు కలబంద , పొద్దుతిరుగుడు నూనెలతో సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం.. మీరు ఒక టీస్పూన్ కలబంద జెల్‌లో అర టీస్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కలపాలి. రెండు చెంచాల నీరు , మూడు చెంచాల జింక్ ఆక్సైడ్ కలిపి సన్నని పేస్ట్ లా చేయండి. ఇప్పుడు మీరు ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంట్లో తయారుచేసిన సన్‌స్క్రీన్ ట్యాన్ సమస్యను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
పసుపు, అలోవెరా సన్‌స్క్రీన్:
ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తొలగించడానికి పసుపును ఉపయోగిస్తారు. ఇది ముఖం మీద ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. సన్‌స్క్రీన్ పేస్ట్ తయారు చేయడానికి.. మీరు ఒక చెంచా కలబంద జెల్‌ను అర చెంచా పసుపు పొడితో కలపాలి. ఈ జెల్ ను ఐస్ బాక్స్ లో స్టోర్ చేయండి . ఐస్ క్యూబ్స్ తయారు అయిన తర్వాత.. మీ ముఖంపై అప్లై చేసి ఆరనివ్వండి.
షీషామ్ , కొబ్బరి నూనెతో సన్‌స్క్రీన్:
కొబ్బరి నూనె ముఖాన్ని లోతుల నుండి తేమగా చేస్తుంది. ఇది ముఖానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కొబ్బరి , రోజ్‌వుడ్ సన్‌స్క్రీన్ పేస్ట్ తయారు చేయడానికి.. మీరు రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా రోజ్‌వుడ్ నూనె , ఒక చెంచా సన్‌ఫ్లవర్ నూనె కలిపి కొంత సమయం మరిగించాలి. అది చల్లబడిన తర్వాత.. ఈ సహజ సన్‌స్క్రీన్‌ను మీ ముఖంపై అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తరచుగా ముఖానికి అప్లై చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. ఫలితంగా మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
Also Read: గ్లిజరిన్‌లో ఈ 2 కలిపి వాడితే.. రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది
విటమిన్ సి జెల్ మాయిశ్చరైజర్:
రెండు టీస్పూన్ల రోజ్‌వుడ్ ఆయిల్ తీసుకోండి . ఇప్పుడు దానికి రెండు చెంచాల మ్యాంగో బటర్ , రెండు చెంచాల జింక్ ఆక్సైడ్ పౌడర్ కలపండి. తర్వాత ఒక టీస్పూన్ కోరిందకాయ గింజల నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిని బాగా కలిపిన తర్వాత.. చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇది ఐస్ క్యూబ్స్‌గా తయారైన తర్వాత.. మీ ముఖంపై క్రమం తప్పకుండా అప్లై చేయండి. దీని వల్ల ముఖంపై ఉన్న ట్యాన్ పూర్తిగా తొలగిపోతుంది.