Salman Khan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan).. ప్రస్తుతం ‘సికందర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏ.ఆర్.మురగదాస్(AR Muragadas) దర్శకత్వంలో మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ చేపట్టింది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ కూడా ప్రమోషన్స్ చేపట్టగా అమీర్ ఖాన్ (Aamir Khan) తో కలిసి సరదాగా ముచ్చటించారు. అందులో భాగంగానే మన ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్? అని అమీర్ ఖాన్ ప్రశ్నించగా.. నేనే అంటూ సమాధానం ఇచ్చారు సల్మాన్ ఖాన్.
పక్కటెముకలు పట్టేయడంతో దానినే స్తుతి
ఇక దానిపై మాట్లాడుతూ.. “సికందర్ సినిమా షూటింగ్ సమయంలో నా పక్కటెముకకు గాయం అయింది. ఆ సమయంలో కూర్చోవడం, నిలబడడం వంటివి కూడా చేయలేకపోయాను. కనీసం నవ్వడం, దగ్గడం కూడా బరువుగా అనిపించేవి. అయినా సరే సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. దీనికి తోడు అదే రోజు డాన్స్ చేయాల్సి వచ్చింది. ఇక గాయం తోనే డాన్స్ చేశాను. ఒక స్టెప్పు వేసే సమయంలో నొప్పితో పక్కటెముకలు పట్టుకున్నా.. ఇక కొరియోగ్రాఫర్ దానినే ఒక కొత్త స్టెప్ గా తీర్చిదిద్దారు. అంతే నా వెనకాల ఉన్న డాన్సర్లు కూడా నన్నే అనుసరించారు” అంటూ సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా మురగదాస్ ఇదే విషయం గురించి మాట్లాడారు. సల్మాన్ ఖాన్ గాయం ఉన్నప్పటికీ కూడా దాదాపు 14 గంటలు షూటింగ్లో పాల్గొన్నారు.
ఆయనతో స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం -రష్మిక
ఇకపోతే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తోంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ..” సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం నా కల. ఇప్పటికి అది నెరవేరింది. ఇంతకు మించిన విషయం మరొకటి ఉంది మురగదాస్ దర్శకత్వంలో కూడా చేయాలని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కలలు కన్నాను. సికందర్లో అవకాశం లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అంటూ రష్మిక తెలిపింది. ఇక మొత్తానికైతే రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హత్యా బెదిరింపులతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్..
ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. మరొకవైపు కృష్ణ జింకను వేటాడిన కేసులో భిష్ణోయ్ వర్గం నుండి హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఈ వర్గం నుండి హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్న ఈయన.. ఎక్కడికి వెళ్లినా సరే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నానని ఎప్పటికి స్వేచ్ఛ, స్వతంత్రం వస్తుందో తెలియదని ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు చూసి అభిమానులు సైతం విచారణ వ్యక్తం చేస్తున్నారు.