Lady Aghori Latest News: తెలుగు రార్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారు ఉండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి వరుసగా నానా హంగామా చేసింది. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అఘోరీ.. ప్రస్తుతం ఆమెపై లైంగిక వేధింపులు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి మాటున రక్తి ఉందంటున్నారు అఘోరీ బాధితులు. మంగళగిరికి చెందిన శ్రీ వర్షిణి అనే యువతి అఘోరి వశమైపోయింది.
ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్ధినీకి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు విద్యార్ధిని ఇంట్లోనే అఘోరీ బస చేసింది. ఆ క్రమంలో ఆఘోరీకి, యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రెండు రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరీగా మారడానికి హైదరాబాద్ వెళుతున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్లింది. తాను మేజర్ ను అని.. అయితే తన తల్లిందండ్రులకు తాను అఘోరీగా మారడం ఇష్టం లేదని, దీంతో ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పింది. అఘోరి వద్దనే ఉంటోంది. నాకు అమ్మ, నాన్న ఎవరు వద్దు.. అఘోరినే ముద్దు అంటోంది. అఘోరీతో నీ వద్దనే ఉంటాను.. నేనెక్కడికీ వెళ్లను అంటోంది. దీంతో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో శ్రీ వర్షిణి తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు.
నా కూతురుకు అఘోరీ మందు, మాకు పెట్టి వశపరచుకుందని ఆరోపిస్తున్నాడు శ్రీవర్షిణి తండ్రి కోటయ్య. అందువల్లే మా అమ్మాయి మా వద్దకు రావడం లేదని ఆరోపిస్తున్నాడు. ఇక శ్రీవర్షిణి అన్నయ్య అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. అఘోరీ తనను లైంగిక వేధింపులకు గురిచేసిందని అంటున్నాడు. ఒకరోజు రాత్రి మద్యం సేవించేందుకు తనను మందు సీసాలతో పాటు కండోమ్ పాకెట్స్ తీసుకురావాలని అఘోరీ బలవంతం చేసినట్టు చెబుతున్నాడు శ్రీవర్షిణి అన్నయ్య. ఇక బైటికి భక్తి గురించి, ఆధ్యాత్మిక అంశాల గురించి హితబోధ చేస్తున్నట్టు చెప్పే అఘోరీ వికృత చేష్టల గురించి బాధితులు రకరకాలుగా చెబుతున్నారు.
మరోవైపు అఘోరీతో కలిసి ప్రయాణించిన విష్ణు అనే వ్యక్తి కూడా అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. అఘోరీకి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని.. ఆర్థికంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అఘోరీకి అండగా ఉన్నట్టుగా చెబుతున్నాడు.
Also Read: పరీక్షాకేంద్రంలో అధికారికి పాము కాటు
ఇదంతా చూస్తుంటే.. పవిత్ర అఘోరాల వేషధారణలో భక్తి పేరిట హల్‌చల్ చేస్తున్న అఘోరీ వెనుక అసలు కథ చాలానే ఉందని.. అఘోరీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఇష్యూ తీవ్ర దూమారం రేపుతోంది. తమ కుమార్తె శ్రీవర్షిణిని ట్రాప్ చేసి, తమపైనే కేసులు పెట్టిస్తున్నాడని ఆవేద వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. అఘోరి దగ్గర బందీగా ఉన్న తమ కూతురిని విడిపించి తమకు అప్పగించాలని కోరతున్నారు. తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని చెబుతున్నారు.