BigTV English

Teeth Whitening Tips: ఇలా చేస్తే.. గార పట్టిన పళ్లు క్షణాల్లోనే.. తెల్లగా మెరిసిపోతాయ్

Teeth Whitening Tips: ఇలా చేస్తే.. గార పట్టిన పళ్లు క్షణాల్లోనే.. తెల్లగా మెరిసిపోతాయ్

Teeth Whitening Tips: ప్రతి ఒక్కరూ తమ పళ్లు తెల్లగా , మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పళ్లు రోజుకు రెండు సార్లు శుభ్రం చేసినా కూడా పసుపు రంగులోనే ఉంటాయి. దీనికి అసలు కారణం ఏంటో చాలా మందికి తెలియదు. పోషకాహార లోపం కూడా పళ్ల రంగు మారడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా చిగుళ్ల ఇన్ఫెక్షన్ కూడా ఇందుకు గల మరో కారణం.


కాల్షియం లోపం లేదా కాలేయ సమస్యల వల్ల కూడా పళ్లు పసుపు రంగులోకి మారతాయి. అంతే కాకుండా ధూమపానం, పొగాకు, కూల్ డ్రింక్స్ , సోడా, టీ కాఫీలు ఎక్కువగా త్రాగడం వల్ల కూడా పళ్ల రంగు మారుతుంది. వీటిలో ఉండే రసాయనాలు మన పళ్లపై ఉన్న ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఫలితంగా పళ్లు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలోనే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా పళ్లను ఇంట్లోనే తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. మీరు కూడా మీ పళ్లు ఇంట్లోనే తెల్లగా మార్చుకోవాలని అనుకుంటే మాత్రం కొన్ని రకాల హోం రెమెడీస్ వాడాలి. మరి వాటిని ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.నిమ్మకాయ, బేకింగ్ సోడా:


కావాల్సినవి:
బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టీ స్పూన్
ఉప్పు- కాస్త

అప్లై చేసే విధానం: ముందుగా పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయండి. తర్వాత ఈ పేస్ట్ ని పళ్లపై బ్రష్‌తో రుద్ది కాసేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల పళ్లు తెల్లగా మారతాయి. ఇందులో ఉపయోగించిన బేకింగ్ సోడాతో పాటు నిమ్మకాయ దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఉప్పు వాటికి పోషణను అందించడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నూనెతో మసాజ్:

కొబ్బరి నూనెతో మీ దంతాలను మసాజ్ చేసి కొద్ది సేపు అలాగే ఉంచాలి. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయండి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ పసుపు రంగులో ఉన్న పళ్లను తెల్లగా మార్చడంలో ఉపయోగపడతాయి.

ఆరెంజ్ తొక్క:

రంగు మారిన పళ్ల కోసం ఆరెంజ్ తొక్కలను ఉపయోగించవచ్చు. ఎలాగంటే.. ఆరెంజ్ తొక్కలను ఎండలో నానబెట్టి తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆతర్వాత దీనిలో వాటర్ కలిపి పళ్లపై రుద్దండి. 10 నిమిషాలు ఆగి కడిగేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తక్కువ సమయంలోనే మీ రంగు మారిన పళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

Also Read: జుట్టు రాలుతోందా ? వీటితో మీ సమస్యకు చెక్

గుడ్డు:

ఎగ్ షెల్ గ్రైండ్ చేసి పౌడర్ తయారు చేయండి. దీనిని పళ్లను శుభ్రం చేయడంలో ఉపయోగించండి. తర్వాత పేస్ట్ తో బ్రెష్ చేయడం వల్ల పసుపు రంగులో ఉన్న మీ పళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

ఇవే కాకుండా దంతాల అంతర్గత ఆరోగ్యం కూడా మీరు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పళ్ల పోషణకు కాల్షియంతో పాటు విటమిన్ డి అవసరం. అందుకే శరీరంలో వీటి లోపం రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×