Marco Jansen: అంతర్జాతీయ క్రికెట్ లో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంతోమందిని చూశాం. దిగ్గజ ఆటగాళ్ల నుండి మొదలుకొని.. సాధారణ ఆటగాళ్ల వరకు ఎంతోమంది ఆట తీరును చూశాం. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కొంతమంది బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ ప్రదర్శన.. ఇలా ఏదో ఒకదాంట్లో తమ మెలకువలను చూపిస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, బ్రాడ్ మాన్ ఇదే కోవలోకి వస్తారు.
Also Read: England players – RCB: RCB దరిద్రం.. ఈ ముగ్గురు ప్లేయర్లు అట్టర్ ఫ్లాఫ్.. రూ. 20 కోట్లు బొక్కా?
కానీ కొంతమంది మాత్రం వారి ఆట తీరుతో కాకుండా రూపురేఖలతో ఆకట్టుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం రోజు సౌత్ ఆఫ్రికా టి-20 లీగ్ (SA 20) సందర్భంగా 17వ మ్యాచ్ సన్రైజర్స్ ఈస్టర్ కేప్ – ప్రిటోరియా క్యాపిటల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు చేసింది.
సన్రైజర్స్ బ్యాటర్లలో మార్క్రమ్ 55 బంతులలో 68 పరుగులతో రాణించాడు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ 16.3 ఓవర్లలోనే 10 వికెట్లను కోల్పోయి కేవలం 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సన్రైజర్స్ 52 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో అటు బౌలింగ్, ఇటు బ్యాట్ తో కూడా రాణించాడు మార్కో జాన్సన్.
20 బంతుల్లో 24 పరుగులు చేసి బ్యాటింగ్ లో, కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి బౌలింగ్ లోను రాణించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ మార్కో జాన్సన్ ని ఇంటర్వ్యూ చేశారు కామెంటేటర్లు. అతడిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో కామెంటేటర్లు అతడికి ఇరువైపులా కుర్చీలు వేసుకుని వాటిపై నిలబడి ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Abhishek Sharma: ఇంగ్లాండ్ అంటే గురువు, శిష్యులకు పండగే.. యూవీ సరసన అభిషేక్ శర్మ ?
మార్కో జాన్సన్ హైట్ అక్షరాల 6.9 అడుగులు. జట్టులో మిగతా సభ్యులంతా అతడి ముందు చిన్నపిల్లల్లా కనిపిస్తారు. గతంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా – మార్కో జాన్సన్ పక్క పక్కన నిల్చున్న ఫోటో కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు కామెంటేటర్లతో జాన్సన్ ఫోటో వైరల్ గా మారింది. తన కెరీర్ లో 17 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మార్కో.. 30 ఇన్నింగ్స్ లలో 21.76 సగటుతో 73 వికెట్లు పడగొట్టాడు. అలాగే 26 వన్డేలలో 32.00 తో 41 వికెట్లు, 17 టీ-20 లలో 31.62 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే టెస్టుల్లో 506 పరుగులు, వన్డేల్లో 461 పరుగులు, టి-20ల్లో 166 పరుగులు చేశాడు.
Point of view – bring chairs when you have to interview Marco Jansen. 😄 pic.twitter.com/3zrEb7HoKp
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025