BigTV English
Advertisement

Director : టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కలకలం… టెన్షన్ లో ఫ్యామిలీ

Director : టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కలకలం… టెన్షన్ లో ఫ్యామిలీ

Director : టాలీవుడ్ లో ఈ ఏడాది మొదటి నుంచే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఐటి రైడ్స్ అంటూ టాలీవుడ్ నిర్మాతల తాట తీస్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు. అయితే మరోవైపు తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది.


20 రోజుల నుంచి కనిపించని డైరెక్టర్…

ప్రముఖ తెలుగు డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (Director Om Ramesh Krishna) హైదరాబాదులో మిస్సయిన ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం 46 ఏళ్ల వయసున్న ఓం రమేష్ కృష్ణ హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్న ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ తెలుగు డైరెక్టర్ ఈనెల 4వ తేదీన బయటకు వెళ్లారు. కానీ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి ఓం రమేష్ కృష్ణ ఆచూకీ కోసం తీవ్రంగా వెతికిన ఫ్యామిలీ మెంబర్స్ చివరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ మిస్ అయ్యారంటూ ఆయన భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టినట్టు తెలుస్తోంది.


మిస్టరీగా మారిన మిస్సింగ్

డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ ఏకంగా 20 రోజుల పాటు కనిపించకుండా పోవడం అన్నది మిస్టరీగా మారింది. ఏదో వారం లేదా 10 రోజులు అంటే ఎక్కడికైనా ట్రిప్ కి లేదా పని మీద వెళ్ళి ఉంటారు అనుకునే అవకాశం ఉండేది. కానీ ఇన్ని రోజుల పాటు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో డైరెక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ లో ఉన్నారు. డైరెక్టర్ రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఇన్ని రోజులపాటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా ఆయన వస్తాడని ఎదురు చూడడం విచిత్రంగా అనిపిస్తోంది. ఇక ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన సన్నిహితులు, సినీ పరిశ్రమలో డైరెక్టర్ తో కలిసి పని చేస్తున్న వారిని విచారిస్తున్నట్టు సమాచారం. కానీ భార్య కు కూడా సమాచారం ఇవ్వకుండా ఆయన ఇన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాడు? ఏమై ఉంటుంది? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

కొనసాగుతున్న ఐటీ రైడ్స్ 

మరోవైపు టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి దాదాపు 200 మంది ఐటి అధికారులు టాలీవుడ్ బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత డిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాత నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, అభిషేక్ అగర్వాల్ వంటి బడా నిర్మాతలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. అలాగే మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా రెండవ రోజు సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఈ ఐటీ రైడ్స్ టెన్షన్ పడుతుంటే, మరోవైపు డైరెక్టర్ మిస్సింగ్ ఘటన షాకింగ్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×