Tips For Hair Colour: ఈ ఫ్యాషన్ , ట్రెండీ యుగంలో.. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ఏ వయసు వారైనా, వేరొకరు ప్రశంసించేలా తమ లుక్ గొప్పగా ఉండాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే వివిధ వయసుల వారికి అనుగుణంగా మార్కెట్లో వివిధ రకాల హెయిర్, స్కిన్ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. యవ్వనంగా కనిపించడానికి.. వృద్ధులు కూడా ప్రస్తుతం జుట్టుకు రంగు వేసుకోవడం వంటివి చేస్తున్నారు.
తెల్ల జుట్టు ఉన్న వారు హెయిర్ డైతో జుట్టుకు రంగు వేసుకుంటారు. దీని వల్ల జుట్టు తక్కువ టైంలోనే నల్లగా కనిపిస్తుంది. మీరు పెద్దయ్యాక యవ్వనంగా కనిపించడానికి కూడా ఇదే ఒక గొప్ప మార్గం. కానీ కొన్నిసార్లు జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండదు. ఇది ఒకటి లేదా రెండు రోజుల్లోనే తొలగిపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల జుట్టు మళ్ళీ తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో జుట్టుకు పదే పదే రంగు వేయడం చాలా కష్టమైన పని. అందుకే మీ జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండేలా కొన్ని చిట్కాలు పాటించడం మంచిది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తడి జుట్టుకు రంగు వేయండి:
మీ జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండాలని , త్వరగా రంగు మారకూడదనుకుంటే హెన్నా అయినా, కలర్ అయినా ఎల్లప్పుడూ తడి జుట్టు మీద అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల అది జుట్టు మీద రంగును ఎక్కువగా గ్రహిస్తుంచేలా చేస్తుంది.
ఎక్కువ రంగులను వాడండి:
మనం జుట్టుకు వేసుకునే రంగులో రెండు అంశాలు ఉంటాయి. డెవలపర్ , కలరెంట్. ఈ రెండు వస్తువులను కలపడం ద్వారా హెయిర్ మాస్క్ తయారవుతుంది. తరువాత దానిని జుట్టుకు అప్లై చేయాలి. రంగు ఎక్కువ రోజులు ఉండేందుకు రంగు వేసేటప్పుడు డెవలపర్ కంటే ఎక్కువ కలరెంట్‌ని ఉపయోగించండి. దీనివల్ల జుట్టు రంగు ఎక్కువ కాలం ఉంటుంది.
షాంపూ వాడకండి:
మీ జుట్టుకు హెయిర్ డై వేసిన తర్వాత.. తలస్నానం చేసేటప్పుడు షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. నిజానికి.. మనం జుట్టుకు రంగు వేసిన తర్వాత షాంపూ ఉపయోగిస్తే, దానిలో ఉండే రసాయనాలు రంగును తొలగిస్తాయి. రంగు వేసిన రెండు మూడు రోజుల తర్వాత మాత్రమే షాంపూను జుట్టుకు వాడాలి.
Also Read: ఈ ఆయిల్స్ వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు !
ఉప్పు వాడకం:
మీరు మీ జుట్టుకు హెయిర్ డై లేదా హెన్నా వేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా దానిలో చిటికెడు ఉప్పు వేయండి. ఉప్పు వాడటం వలన అది గట్టిగా మారుతుంది. జుట్టు మీద ఎక్కువ కాలం ఉంటుంది. నిజానికి ఉప్పు రంగును బంధించడానికి పనిచేస్తుంది. ఫలితంగా మీ తెల్ల జుట్టుకు తరచుగా రంగు వేయాల్సిన అవసరం ఉండదు.