BigTV English

BRS : కవితకు హరీష్‌రావు షాక్.. కేటీఆర్ గేమ్ షురూ..

BRS : కవితకు హరీష్‌రావు షాక్.. కేటీఆర్ గేమ్ షురూ..

BRS : బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు గురించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో కేటీఆర్, హరీష్‌రావుల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆ తర్వాత కేటీఆర్, కవితల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోంది. అది కాస్త ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అధికారంలో ఉన్నప్పుడు.. అవసరాల మేరకు అంతా అడ్జస్ట్ అయినట్టున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేసరికి గొడవలు బయటపడుతున్నాయని అంటున్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా కేటీఆర్ చుట్టూనే కుటుంబ పోరు నడుస్తోంది. ఎప్పటికప్పుడు ఆయనదే అప్పర్ హ్యాండ్ అవుతూ వస్తోంది. కేసీఆర్ ఫుల్ సపోర్ట్ కొడుక్కే ఉండటంతో అలా నెగ్గుకొస్తున్నారు. హరీష్‌రావు అల్లుడు కాబట్టి సైడ్ అయ్యారు కానీ.. కూతురు కవిత మాత్రం తగ్గేదేలే అంటూ చివరి వరకూ కొట్లాడుతానంటున్నారు. కేటీఆర్, హరీష్‌రావు, కవితల ట్రయాంగిల్ ఫైట్ నుంచి ఇప్పుడు ఒకరు అవుట్ అయ్యారు. మరో ఇద్దరు మిగిలారు. ఇంతకీ మేటర్ ఏంటంటే…


కేటీఆర్‌కు హరీష్ సపోర్ట్

KCR తర్వాత BRS నాయకత్వ బాధ్యతలు KTRకు అప్పగిస్తే తాను స్వాగతిస్తానన్నారు ఆ పార్టీ నేత హరీష్‌రావు. BRS అధినేతగా KCR ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని తాను ఎన్నోసార్లు చెప్పానని, KCR ఆదేశాలను జవదాటనని మరోసారి స్పష్టం చేశారు. తాను కేసీఆర్‌కు, పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని చెప్పుకొచ్చారు. అదీ సంగతి. ఆయన మాటలను బట్టి.. ఆధిపత్య పోరు నుంచి హరీష్‌రావు హ్యాండ్సప్ అన్నట్టే అంటున్నారు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఆయనలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవితల మధ్య ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. నెంబర్ 2 రేసులో హరీష్‌రావు పేరు కూడా తరుచూ వినిపిస్తోంది. అందుకే, ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. రేసులో తాను లేనని, కేటీఆర్ తర్వాతే తానని డైరెక్ట్‌గా చెప్పేశారు. ఇక నెంబర్ 2 స్థానం కోసం కేటీఆర్, కవితలే మిగిలారు.


కవిత సామాజిక పోారాటం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జైలు నుంచి వచ్చాక ఆమె తీరు మారిపోయింది. గులాబీ దళానికి దూరంగా ఉంటున్నారో.. గులాబీ పార్టీయే ఆమెను దూరం పెడుతోందో తెలీదు కానీ.. గ్యాప్ అయితే వచ్చింది. జాగృతి జెండా నీడన కవిత రాజకీయం చేస్తున్నారు. బీసీ నినాదం ఎత్తుకున్నారు. జ్యోతిబా ఫూలే విగ్రహం కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ కావాలంటూ కొత్త నినాదం అందుకున్నారు. ఇవన్నీ బీఆర్ఎస్‌కు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇబ్బందికరమైన అంశాలే.

కవిత తగ్గేదేలే..

కవిత ఎక్కడా తగ్గట్లే. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని అంటున్నారు. తనపై దుష్ప్రచారం జరుగుతోందని.. ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసంటున్నారు. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా.. ఇంకా తనను కష్టపెడతారా? అంటూ ఎమోషనల్ కూడా అయ్యారు. కవిత కామెంట్స్ అన్నీ కేటీఆర్ టార్గెట్‌గా చేసినవేనని అంటున్నారు. మరోవైపు, త్వరలోనే కవిత కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. లేటెస్ట్‌గా భవిష్యత్తులో కవిత సీఎం అవుతారంటూ ఓ సోదమ్మ జాతకం కూడా చెప్పడం ఆసక్తికరం. సరిగ్గా ఇదే సమయంలో తన ఫుల్ సపోర్ట్ కేటీఆర్‌కే అంటూ.. కవితకు హరీష్‌రావు హ్యాండిచ్చారని అంటున్నారు. హరీష్ రావు కావాలనే కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానంటూ మెసేజ్ ఇచ్చి.. పరోక్షంగా కవితకు చెక్ పెట్టారని భావిస్తున్నారు. హరీష్ కామెంట్స్ వెనుక కేటీఆర్ ప్రెజర్ ఉందని అంటున్నారు. పాపం కవిత.. అన్న, బావల తోడు లేకుండా ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

Also Read : అణుబాంబు పేలితే ఎట్టా ఉంటాదో తెలుసా?

Related News

Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీరులో సర్ప్రైజ్.. వరంగల్‌లో షాకింగ్ ఘటన!

HC Banned Beef: కావాలంటే ముందు రోజు కొనుక్కో.. బీఫ్ లవర్స్‌కు హైకోర్టు మొట్టికాయలు

TG Heavy Rains: తెలంగాణ ఐదు రోజులు భారీ వర్షాలు.. బయటకు వెళ్లొద్దు

Hyderabad building: బేగంబజార్‌లో కూలిన పాత భవనం.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Peddamma Temple: పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Musi River: మూసీ వరదలో చిక్కుకున్న యువకుడు.. రెస్క్యూ టీమ్ వచ్చే లోపే..

Big Stories

×