BigTV English

Bird flu in Cats : పెంపుడు పిల్లుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ – నెక్స్ట్ మనుషులకే జాగ్రత్త!

Bird flu in Cats : పెంపుడు పిల్లుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ – నెక్స్ట్ మనుషులకే జాగ్రత్త!

Bird flu in Cats : భారత్ లో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ తొలిసారి పెంపుడు పిల్లుల్లో సైతం గుర్తించారు. ఇంతకు ముందు వరకు ఎక్కడా అలాంటి కేసులో నమోదు కాకపోవడంతో.. బర్డ్ ఫ్లూ జాతి  వైరస్ పరివర్తనాలు మానవులకు వేగంగా సోకే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో బర్డ్ ప్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ICAR – NIHSAD, కేంద్ర పశు సంవర్థక శాఖ అధికారులు.. ఈ ఏడాది జనవరిలో నాగపూర్ సరిహద్దులోని ఓ గ్రామంలో సేకరించిన నమునాల్లో పెంపుడు పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తిని తొలిసారి గుర్తించారు.


ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ H5N1 రకానికి చెందిన ఉత్పరివర్తనం. అంటే.. బర్డ్ ఫ్లూ వైరస్ లో క్రమంగా చోటుచేసుకునే మార్పులతో ఏర్పడిన సరికొత్త జాతి వైరస్. ఈ వైరస్ అనేక సంఖ్యలో పరివర్తనాలు  చేసుకుంటూ.. క్షీరదాలను ఆవాసంగా చేసుకొని వ్యాప్తి చెందుతూ ఉంటుంది. గతంలో ప్రపంచాన్ని స్థంభింపజేసిన కోవిడ్ 19 వైరస్.. ఇలానే క్షీరధార ద్వారా మనుషులకు వ్యాప్తి చెందిన వైరస్.. విస్తృతంగా మనుషులకు సోకింది. ప్రస్తుత  బర్డ్ ఫ్లూ వైరస్ జాతిలోని పరివర్తనాలు సైతం నిత్యం మారుతుండడం, తొలిసారి పిల్లుల్లో  గుర్తించడంతో దీని వ్యాప్తి ఎలా ఉండనుందో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా కోళ్లకు వ్యాప్తి చెందిన బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వర్గానికి సంబంధించింది కాగా.. ప్రస్తుతం పిల్లుల్లో గుర్తించిన వైరస్ 2.3.2.1 ఏ వంశానికి చెందినదిగా శాస్త్రీయ బృందం నిర్థరించింది. ఇది బర్డ్ ఫ్లు జాతిలోనే పరివర్తన చెందిన వైరస్ అని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఇప్పటి వరకు ఈ వైరస్ పెంపుడు పిల్లల నుంచి ఇతర జంతువులకు సోకిన ఆనవాళ్లను గుర్తించలేదు. అయితే.. ఈ వైరస్ వేగంగా పరివర్తనం చెంది ఇతర పిల్లులకు, లేదా ఇతర జంతువులకు సైతం వ్యాప్తించే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు.


ఈ వైరస్ యొక్క సహజ గుణాలను పరిశీలిస్తే ఇవి పరివర్తన చెందుతూ మానవులకు క్షీరదాలకు సోకిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ వైరస్ సోకిన పెంపుడు పిల్లలు ఎలా ప్రవర్తించాయి, వాటి వ్యాధికారక లక్షణాలు ఏంటనే పరిశోధించిన శాస్త్రవేత్తలకు అనేక విషయాలు తెలిశాయి.

వైరస్ సోకిన పిల్లులు అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, నీరసం వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాయని గుర్తించారు. నమూనాల సేకరించిన ఒకటి నుంచి మూడు రోజుల్లో పిల్లులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు గుర్తించారు. అలాగే పిల్లల్లో కనిపించే వైరస్ లో 27 ఉత్పరివర్తనాలను సైతం శాస్త్రవేత్తలు నమోదు చేశారు. కొత్త విషయం వెలుగు చూసిన నేపథ్యంలో పెంపుడు జంతువులు, మనుషులు, దేశ పౌల్ట్రీ రంగాలతో పాటు క్షీరదాలు, అటవీ పక్షులలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఉన్న పరిశోధనా అనుభవాలను బట్టి ఈ వైరస్ మానవులకు సోకే అవకాశం చాలా తక్కువ. ప్రస్తుతానికి ఈ వైరస్ మానవులకు వ్యాప్తి చెందేలా పరివర్తనం చెందలేదు అన్నది పరిశోధకుల మాట. అంతమాత్రాన ఈ వైరస్ కు ఆ సామర్థ్యం లేదని, దీంట్లో అలాంటి పరివర్తనాలు రావని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు శాస్త్రవేత్తలు.

హ్యూమన్ టు హ్యూమన్ సోకే స్థితికి వైరస్ లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. మనుషులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే వైరస్ పరివర్తనాలపై శాస్త్రవేత్తలు నిత్యం నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేదంటే ఇది మరో మహమ్మారిగా మారి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

Also Read : High Selenium Wheat Baldness: వీడిన మిస్టరీ.. మహారాష్ట్ర గ్రామాల్లో అందరికీ బట్టతలకు కారణం అదే

అలాగే H5N1 వైరస్ మనుషులకి కొత్త అని.. దీనికి సంబంధించిన యాంటీబాడీలు మన శరీరంలో లేవని, ఒకవేళ అలాంటి వైరస్ మనుషులకు సోకితే దానితో పోరాడే శక్తి మానవులకు లేదనేదన్న వైరాలజిస్టుల మాట. అందుకే ఈ వైరస్ వ్యాప్తి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు. పిల్లులు అనారోగ్యానికి గురైతే వాటిని వెంటనే వైద్యశాలలకు తరలించడం, లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×