BigTV English

TGSRTC Update: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ బ్యాగ్ మరచిపోతే ఇలా చేయండి..

TGSRTC Update: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ బ్యాగ్ మరచిపోతే ఇలా చేయండి..

TGSRTC Update: ఓ వ్యక్తి చేతిలో బ్యాగుతో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అందులో పొలం అమ్మిన డబ్బులు ఉన్నాయి. అయితే తను దిగాల్సిన స్టేజీ రానే వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి బస్సు దిగారు. కానీ చేతిలో బ్యాగు లేదు. అసలే డబ్బులు ఉన్నాయి బ్యాగులో. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి ప్రయాణికుడు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలో ఎందరో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఉత్తమ సేవలు అందిస్తూ తమ విధి నిర్వహణలో లీనమవుతున్నారు. అయితే సాధారణంగా మనం ఆర్టీసీ బస్ లో ప్రయాణించే సమయంలో తగిన చిల్లర తీసుకొని సహకరించవలెను అనే బోర్డు మనకు కనిపిస్తుంటుంది. చాలా వరకు ప్రయాణికులు ప్రయాణం సాగించాలన్న తొందరలో తగిన చిల్లర తీసుకోకుండా, ఆర్టీసీ బస్ ఎక్కడం సర్వసాధారణం. ఇటువంటి సమయంలో కండక్టర్లు తమ వద్ద చిల్లర అందుబాటులో ఉంటే అందించడం, లేకుంటే టికెట్ వెనుక భాగాన రాసి ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం చాలా బస్సులకు డ్రైవర్ ఒక్కరే కండక్టర్ విధి నిర్వహణ సాగిస్తున్న పరిస్థితి. వారు టికెట్స్ త్వరగా అందించాలన్న ఉద్దేశంతో టికెట్ కు సరిపడ చిల్లర ఇవ్వని పక్షంలో టికెట్ వెనుక భాగాన ఇవ్వాల్సిన నగదును రాస్తారు. అయితే దిగాల్సిన స్టేజీ రాగానే, ప్రయాణికుడు హడావుడిగా దిగి వెళ్లే సందర్భాలు చాలా ఉంటాయి. అప్పుడు చిల్లర మరచిపోయామన్న ఆవేదన ప్రయాణికులకు ఉండక మానదు. అలాగే ఆ ప్రయాణికుడు చిల్లర తీసుకోలేదన్న మనోవేదన కండక్టర్ మదిలో కూడ ఉండక మానదు. ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఓ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం మీకు తెలుసా.. తెలియకుంటే, మీకోసమే ఈ సమాచారం!


ఇప్పుడు అన్ని ఆర్టీసీ బస్సుల్లో టిమ్ మిషిన్ ద్వార టికెట్స్ అందిస్తున్నారు. అందులో ఎవరైతే కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారో, వారి ఐడి కూడ అందులో ఉంటుంది. సాధారణంగా మనకు టికెట్ వెనుక చిల్లర రాసి మరచిపోయిన క్రమంలో.. ముందుగా మనం మన టికెట్ పై గల ఐడి నెంబర్ రాసుకోవాలి. ఆ తర్వాత 040-69440000 నెంబర్ కు కాల్ చేయాలి. ఈ నెంబర్ టోల్ ఫ్రీ కావడం విశేషం. ప్రయాణికులు పూర్తి వివరాలు తెలిపిన వెంటనే కాల్ సెంటర్ సిబ్బంది వారికి చిల్లర అందేవిధంగా చర్యలు తీసుకుంటారు.

Also Read: SLBC tunnel Collapse: SLBC టన్నెల్ లోపల.. భయానక దృశ్యాలు.. లేటెస్ట్ అప్ డేట్..

అంతేకాదు కొందరు విలువైన వస్తువులు గల బ్యాగులను బస్సులలో మరచిపోతారు. అటువంటి వారు కూడా ఈ నెంబర్ కు సమాచారం ఇస్తే చాలు, మీ బ్యాగ్ సేఫ్. మరెందుకు ఆలస్యం.. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కాల్ చేయండి. అయితే వృథాగా కాల్ చేసి సమాచారం ఇస్తే, వాస్తవంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు. అందుకే తెలంగాణ ఆర్టీసీ కల్పించిన ఈ సౌకర్యాన్ని అవసరమైనప్పుడు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×