Sonakshi Sinha: ఈరోజుల్లో వేర్వేరు సామాజిక వర్గాలు, వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇలా జరిగితే.. అది ప్రేక్షకుల్లో కచ్చితంగా హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇప్పటివరకు వేర్వేరు మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లితో ఒక్కటయ్యారు. అలాంటి వారిలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందులో సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్ కూడా ఒకరు. అప్పట్లో వీరి పెళ్లికి సోనాక్షి ఫ్యామిలీ అసలు సపోర్ట్ చేయడం లేదనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. తాజాగా వీటన్నింటిపై సోనాక్షి సిన్హా స్పందించింది.
అసలు నిజమేంటి.?
సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్ (Zaheer Iqbal) కలిసి రెజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లయ్యే వరకు ఈ విషయం గురించి పబ్లిసిటీ చేసుకోకూడదు అనే ఉద్దేశ్యంతో దాని గురించి ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఏదో ఒక విధంగా ఈ విషయం బయటికొచ్చింది. దీంతో సోనాక్షి సిన్హా ఈ విషయంపై స్పందించకపోయినా తన తండ్రి, సీనియర్ నటుడు అయిన షత్రుఘ్న సిన్హా స్పందనను అడిగి తెలుసుకుంది బాలీవుడ్ మీడియా. అప్పుడు ఆయన దగ్గర నుండి వచ్చిన నెగిటివ్ రియాక్షన్ చూసి సోనాక్షి ఫ్యామిలీకి ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోయారు. పైగా ఈ పెళ్లికి సోనాక్షి బ్రదర్స్ కూడా రాలేదు. ఇక పెళ్లయిన ఇన్నాళ్ల తర్వాత ఈ విషయంపై సోనాక్షి స్పందించింది.
మతాలు వేరైనా
మతాలు వేరు కాబట్టి తన కుటుంబం తన పెళ్లికి సపోర్ట్ చేయలేదు అనే విషయంపై సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) క్లారిటీ ఇచ్చింది. ‘‘జాహీర్ గానీ, నేను గానీ మా మతాల గురించి పెద్దగా పట్టించుకోము. మేము ఇద్దరు వేర్వేరు వ్యక్తులం. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. తను తన మతాన్ని నాపై రుద్దాలని అనుకోలేదు. నేను కూడా నా మతాన్ని తనపై రుద్దాలని అనుకోలేదు. అసలు మా మధ్య ఇలాంటి డిస్కషన్ కూడా ఎప్పుడూ రాదు. మేము మా ఇద్దరి కల్చర్స్ వేరు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఒకరి కల్చర్‌ను మరొకరం గౌరవిస్తాం. వాళ్ల ఇంట్లో కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు. మా ఇంట్లో కొన్ని పద్ధతులు ఫాలో అవుతాం’’ అంటూ వారి మధ్య ఉన్న తేడాల గురించి చెప్పుకొచ్చింది సోనాక్షి.
Also Read: డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ.. రొటీన్‌గా సల్మాన్ ‘సికిందర్’ టీజర్
ఎప్పుడూ అడగలేదు
‘‘జాహీర్ మా ఇంట్లో దీపావళి పూజాకు హాజరవుతాడు. వాళ్ల పూజల్లో నేను కూడా పాల్గొంటాను. నేను హిందీ అమ్మాయిగా నా మతం మార్చుకోకుండా.. తను ముస్లిం అబ్బాయిగా తన మతం మార్చుకోకుండా పెళ్లి చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బెటర్ అని అనుకున్నాం. అందుకే అలా పెళ్లి చేసుకున్నాం. అంతే సింపుల్. తను నన్ను ఎప్పుడూ మతం మార్చుకుంటావా అని అడగలేదు. ప్రేమించాం. పెళ్లి చేసుకున్నాం’’ అంటూ తన భర్త జాహిర్ ఇక్బాల్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది సోనాక్షి సిన్హా. వీరిద్దరూ 2024 జూన్ 23న వివాహం చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ అయినా రెజిస్టర్ మ్యారేజ్ చేసుకొని చాలామందికి ఆదర్శంగా నిలిచింది సోనాక్షి.