Big Stories

Cancerous Moles: మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా..? క్యాన్సర్ మచ్చలా..?

Moles on the Body Caused Cancer..?: పుట్టినప్పటి నుంచే మన శరీరంపై కొన్ని మచ్చలు కనిపిస్తుంటాయి. అవి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి పుట్టుమచ్చలు అంటారు. ఈ మచ్చల ఆధారంగానే మీరు చాలా అదృష్టవంతులని చెబుతుంటారు పెద్దలు. కానీ కొన్ని మచ్చలు వయసు పెరిగే క్రమంలో వస్తుంటాయి. అవి చూడటానికి పుట్టుమచ్చల్లానే కనపడతాయి.

- Advertisement -

వయసు పెరిగే కొద్ది మన శరీరంపై చాలా మచ్చలు వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోము. ఆ మచ్చలు మనకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయనుకుంటేనే వాటిపై దృష్టి పెడతాము. ఇక అవి మన అందానికి ఆటంకం కలిగాస్తాయని భావిస్తే అసలు ఊరుకోము.

- Advertisement -

Read More: పొట్ట క్యాన్సర్‌తో మరణించిన ఇళయరాజా కూతురు.. కారణాలు ఇవే..!

ఆ మచ్చను తొలగించే వరకు నిద్ర కూడా రాదు. కొందరు ఏకంగా సర్జరీ చేయించి వాటిని శరీరంపై నుంచి తొలగిస్తారు. అయితే అవి నిజంగా పుట్టుమచ్చలా? లేదంటే శరీరంలో వచ్చే మార్పులకు సంకేతాలా? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా ? ప్రతి మచ్చ వెనుక ఓ కథ ఉంటుందట. అదేంటో తెలుసుకుందాం.

పుట్టుమచ్చలను శాస్త్రీయంగా నెవి అనే పేరుతో పిలుస్తారు. వాడుక భాషలో వీటిని లక్ మార్క్ అని కూడా అంటారు. ఈ మచ్చలు శరీంలోని మెలనోసైట్స్ అనే క్లస్టర్ పిగ్మెంట్ ఉత్పత్తి కణాల ద్వారా ఏర్పడతాయి. ఇవి శరీరం లోపలి నుంచి చర్మంపైకి కనిపిస్తుంటాయి. పుట్టుమచ్చలు యుక్తవయసు నుంచి 40 ఏళ్ల వరకు ఉంటాయి.

పుట్టుమచ్చలు వివిధ రంగులు, ఆకారాలలో కనిపిస్తాయి. కాలక్రమేణా ఇవి అనేక మార్పులకు లోనవుతాయి. లేత రంగు నుంచి ముదురు రంగును మారుతాయి. ఈ మచ్చలను శరీంపై తొలగించడం అంత సులభం కాదు.

Read More: గోబీ మంచూరియా బ్యాన్..!

కొన్ని మచ్చలను పుట్టుమచ్చలు అనుకుంటారు. పుట్టుమచ్చలు అనేవి చర్మకణాల సమూహం నుంచి విభిన్నంగా ఏర్పడతాయి. కానీ చిన్నచిన్న మచ్చలు దీనికి పూర్తి విరుద్దంగా ఫ్లాట్ రూపాన్ని కలిగి ఉంటాయి. రెండో రకం మెలనోసైట్‌ల ద్వారా ఉత్పత్తి అవుతాయి.

అంతే కాకుండా మెలనిన్ నుంచి వాటి రంగును పొందుతాయి. ఇవి సూర్మరశ్మి ద్వారా ప్రభావితం అవుతాయి. చిన్నచిన్న మచ్చలు చూడటానికి పుట్టుమచ్చలా ఉన్నా.. రూపాంతరం చెందవు. కాబట్టి వాటిని కేవలం మచ్చలుగా గుర్తించాలి.

పుట్టుమచ్చలు సాధారణంగా చాలా ముదురు రంగులో ఉంటాయి. చిన్నచిన్న మచ్చలను మీరు గుర్తించినట్లయితే ఎక్కువగా ఎరుపు లేదా లేత గోధుమ రంగులో కనిపిస్తాయి. పుట్టుమచ్చలను సులభంగా గుర్తించొచ్చు. మచ్చల రంగు ఆధారంగా చెప్పవచ్చు.

Read More: దిండుకు గుడ్‌బై చెప్పు..!

పుట్టుమచ్చలు వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండనప్పటికీ.. కొన్ని చర్మ క్యాన్సర్‌ను అభివ‌ద్ధి చేస్తాయి. ముఖ్యంగా పుట్టుమచ్చలు సూర్యుని కాంతికి గురైనప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడతుంది. దీనివల్ల ఎపిటికల్ నెవి అని పిలవబడే మచ్చలు మెలనోమా అంటే మెలనోసైట్స్‌లో మొదలయ్యే చర్మక్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

మీకు పుట్టుమచ్చలపై ఇటువంటి అనుమానం గనుక కలిగితే వైద్యులను కలవండి. వారి సలహా మేరకు స్కిన్ టెస్ట్‌లు చేయించుకోండి. ముందుగా గుర్తించడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు. కాబట్టి చర్మంపై వచ్చే మచ్చలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే మంచిది.

Disclaimer: ఆరోగ్య నిపుణులు సూచనల ప్రకారం ఈ కథనం రూపొందించబడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News