BigTV English

Black Rice : ఒకప్పుడు రాజులు తినే బియ్యం.. అద్భుత పోషకాలు

Black Rice : ఒకప్పుడు రాజులు తినే బియ్యం.. అద్భుత పోషకాలు

Black Rice : సాధారణంగా మనం పాలీష్‌ చేసిన సన్న బియ్యం తింటుంటాం. పల్లెల్లో అయితే పంట నుంచి వచ్చిన దొడ్డు బియ్యాన్నే తింటుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతారు. పూర్వం పెద్దవారు ముడి బియ్యాన్ని తినేవారు. అయితే రాజుల కాలంలో ఎక్కువగా నల్ల బియ్యాన్ని ఎక్కువగా తీసుకునేవారు. ఎన్నో పోషకాలతో ఉన్న ఈ నల్ల బియ్యం ఎంతో ఉత్తేజకరం. మన దేశంలో తొలుత ఈ బియ్యం సాగు అసోంలో ప్రారంభమైనట్లుగా చెబుతారు. అక్కడి నుంచి చాలా ప్రాంతాలకు విస్తరించింది. చీడపీడలు పట్టని ఈ వరి సాగు మనకు 100 రోజుల్లోనే చేతికి దిగుబడి వస్తుంది. పురాతనకాలంలో రాజుల కోసం చైనాలో ఎక్కువగా దీన్ని సాగు చేసేవారు. ఎన్నో పోషకాలుండే ఈ నల్లబియ్యం సాధారణ బియ్యం కంటే ఎక్కువగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. నల్ల బియ్యంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్‌, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఈ బియ్యంలో లభించే ఆంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లను సమర్ధంగా అడ్డుకుంటుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆంథోసైనిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ బియ్యం కాపాడుతుంది. డయాబెటిస్‌ ఉన్నవారికి కూడా ఈ నల్లబియ్యం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోకెమికల్స్‌ శరీరంలోని ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరిచి శరీరం గ్లూకోజ్‌ను మెరుగైన రీతిలో ఉపయోగించుకునేలా చేస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంచుతుంది. చిన్న పేగుల్లో చక్కెరను త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. నిత్యం ఈ రైస్‌ తింటే శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. లివర్‌ డిటాక్సిఫికేషన్‌లో కూడా తోడ్పాటును అందిస్తుంది. రక్తపోటు సమస్య నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది. సగం కప్పు నల్ల బియ్యం అన్నంలో 173 క్యాలరీలు, 5 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల కొవ్వు, 1 మిల్లీగ్రాము ఐరన్‌, 38 గ్రాముల పిండి పదార్థాలు, 1 గ్రాము చక్కెర, 4 మిల్లీగ్రాముల సోడియం ఉంటాయి. వైట్, బ్రౌన్ రైస్‌తో పోలిస్తే ఈ బ్లాక్ రైస్‌లో కొలెస్ట్రాల్ అసలే ఉండదు. ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, కండరాలను పెంచే వారికి ఇది గొప్ప ఎంపిక. ఒకసారి బ్లాక్ రైస్ తింటే రోజువారీగా శనీరానికి అవసరమయ్యే 60 శాతం ఐరన్‌, 4 శాతం ఫైబర్ అందుతుంది.


Tags

Related News

Mint leaves benefits: ఉదయాన్నే ఈ ట్రిక్ చేస్తేచాలు.. మీ రోగాలన్నీ బలాదూర్

Black pepper benefits: అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ పొడితో జస్ట్ ఇలా ట్రై చేయండి

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Big Stories

×