BigTV English

Breast Reduction Surgeries: 2019 నుంచి భారత్ లో పెరిగిన బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలు.. కారణమేంటి..?

Breast Reduction Surgeries: 2019 నుంచి భారత్ లో పెరిగిన బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలు.. కారణమేంటి..?

Breast Reduction Surgeries Increased in India from 2019: 2019 నుంచి ఇండియాలో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీల రేటు పెరిగినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. అందుకు కారణం.. అందం. ప్రతి మహిళ అందంగా కనిపించాలనుకుంటుంది. కానీ కొందరు అందవిహీనంగా కనిపించడానికి వారి రొమ్ములు కూడా కారణంగా మారుతున్నాయి. కాలక్రమేణా మారిన ఆహారపు అలవాట్లు, జీన్స్, కొందరికి పెళ్లై పిల్లలు పుట్టాక.. బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. శరీర ఆకృతికి ఏ మాత్రం సంబంధం లేకుండా పెరగడంతో.. వారు అందవిహీనంగా కనిపిస్తున్నారు. ఇలాంటి వారిని చూసి కామెంట్స్ చేసేవారూ అధికంగానే ఉంటున్నారు. అందుకే.. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే.. రొమ్ములను తగ్గించుకునేందుకు సర్జరీ చేయించుకుంటున్నారు.


జస్ప్రీత్ (పేరు మార్చబడింది) అనే యువతి.. కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బస్సెక్కగా.. ఒక వ్యక్తి వావ్ వాటే సైజ్ అని గట్టిగా అరిచాడని అధ్యయనంలో తెలిపింది. అలా అరిచిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలుసని, అలాంటి కామెంట్స్ తనకు కొత్తేమీ కాదని చెప్పింది. కానీ తన బ్రెస్ట్ సైజ్ ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. హైపర్ట్రోఫీ చికిత్స తీసుకుంది. సర్జరీ తర్వాత ఆమె బ్రెస్ట్ సైజ్ 42H నుండి 40Bకి తగ్గిందని.. ఇప్పుడు మంచి శరీర ఆకృతితో చాలా బాగున్నానని చెప్పుకొచ్చింది.

జస్ప్రీత్ ఎదుర్కొన్న సమస్యే.. భారత్ లో అనేకమంది స్త్రీలు ఎదుర్కొంటున్నారు. కొందరు సర్జరీలతో తగ్గించుకుంటే.. మరికొందరు వ్యాయామాలు చేయడం ద్వారా బ్రెస్ట్ సైజులను తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. నచ్చిన డ్రస్ వేసుకోలేక, బాహ్య ప్రపంచాన్ని చూడలేక ఉండిపోతున్నారు. అలాంటి వారు సర్జరీ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. నెలకు 4 నుంచి 6 మంది సర్జరీలు చేయించుకుంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.


Also Read: 40 ఏళ్లలో యంగ్ లుకింగ్.. ఏ విధంగా..?

బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ వల్ల ఏవైనా దుష్ర్పభావాలు ఉంటాయా అంటే.. అవుననే అంటున్నారు వైద్యులు. శస్త్రచికిత్స కారణంగా మచ్చలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. కాలక్రమేణా ఇవి తగ్గవచ్చు కానీ.. పూర్తిగా పోవని పేర్కొన్నారు. చనుమొనలోనూ మార్పులు రావొచ్చు. శస్త్రచికిత్స తర్వాత పాలిచ్చే తల్లులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సర్జరీ సరిగ్గా జరగని పక్షంలో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు. దీనికి యాంటీబయాటిక్ చికిత్స కూడా ఉంటుంది.

Tags

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×