మనిషికి జీవనాధారం నీరే. భూమిపై జీవి పుట్టుకకు ఆధారం కూడా నీరే. అలాంటి నీరే ఇప్పుడు సంక్షోభంలో పడింది. ప్రపంచంలో చాలా దేశాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. 2030 నాటికి మన పక్క దేశమైన ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబోలు ప్రపంచంలోనే తీవ్రంగా నీటి కొరత ఏర్పడే రాజధానిగా మారుతుందని ఒక కొత్త అధ్యయనం తెలుస్తోంది.
భూమి నుండి అధిక నీటిని వెలికి తీయడం, వాతావరణంలో మార్పులు, భూగర్భ జల నిల్వలు క్షీణించడం వంటివి అక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల మరొక ఐధేళ్లలోనే కాబూల్ లో నీటి కొరత తీవ్రంగా ఏర్పడుతుంది. నీటి సంక్షోభం వల్ల కాబూల్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన సమస్య ఇదే
కాబూల్ నగరంలో ప్రస్తుతం 60 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. నీరు పూర్తిగా భూగర్భ జలాల పైనే ఆధారపడి ఉన్నారు. ఈ నీరు కూడా హిందూ కుష్ పర్వతాలపై నుంచి మంచు కరిగి హిమానినదాల రూపంలో వస్తుంది. అయితే ఈ హిమానీనదాలు గత కొన్నేళ్లుగా చాలావరకు తగ్గిపోయాయి. మెర్సీ కార్ప్స్ నివేదిక ప్రకారం నీటి వినియోగం పెరిగిపోవడం, జలాశయాలు ఎండిపోవడం, అలాగే నీరు కలుషిత కావడం వీటివల్ల కాబూల్ తీవ్రమైన, స్వచ్ఛమైన నీటి కొరత ఏర్పడుతోంది. అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు కేవలం నీటి కొరత కారణంగానే మూసివేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది.
ఆఫ్ఘనిస్థాన్ కు నీటిని ఇచ్చేది హిందూకుష్ పర్వతాలపై ఉండే మంచే ఆ మంచు కరిగి నీటిని ఇస్తుంది. వర్షాలు కూడా పడతాయి కానీ ఆ వర్షపు నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఆఫ్గనిస్తాన్ కు లేదు. అలాంటి ప్రక్రియలు కూడా అక్కడ జరగడం లేదు. వర్షాలు వచ్చినప్పుడు నగరంలో వరదలు వస్తున్నాయి. ఆ నీటిని వారు సురక్షితంగా నిల్వ చేసుకోలేకపోతున్నారు.
తాలిబాన్ పాలన ముగిసిపోయిన తర్వాత ఎంతోమంది ప్రజలు పని కోసం అలాగే భద్రత కోసం పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి కాబూల్ కు వచ్చేశారు. దీనితో జనాభా ఎక్కువైపోయింది. ఇంత పెద్ద జనాభాకు మీరు కూడా అధికంగానే కావాలి. ఇప్పటికే అక్కడ ఉన్న వందలాది ఫ్యాక్టరీలు, గ్రీన్ హౌస్ లు ఎక్కువ నీటిని వాడేస్తున్నాయి. ఇక సామాన్య జనానికి మీరు అందే అవకాశం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.
యూనిసెఫ్ తన వంతు సహాయాన్ని చేస్తూనే ఉంది. అక్కడ ఉన్న హ్యాండ్ పంపులను మరమ్మత్తులు చేస్తుంది. అలాగే నీటిని శుద్ధి చేసే బయో ఇసుక ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేస్తోంది. కానీ ఇవేవీ అక్కడి ప్రజల దాహార్తిని తీర్చలేక పోతున్నాయి. అయితే కబుర్లు ఒక ఆనకట్టను నిర్మించడం ద్వారా 20 లక్షల మందికి స్వచ్ఛమైన నీటిని అందించే అవకాశం ఉంది. కానీ దానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం పడతాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి కాబూల్ ఎడారిలా మారిపోయే అవకాశం ఉంది. నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూడాల్సి రావచ్చు. అందుకే 2030 నాటికి నీటి కొరత తీవ్రంగా ఏర్పడితే అక్కడ నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం కాబూల్ మాత్రమే కాదు ఇతర దేశాలు ప్రాంతాల వారు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న నీటి వనరులను కాపాడుకోవాలి నీటి వృధాను తగ్గించుకోవాలి. లేకపోతే కాబూల్ లాంటి పరిస్థితులే ప్రతిదేశానికి వచ్చే అవకాశం ఉంది.