Viral Video: ఆవేశం మనిషిని ఏమైనా చేస్తుంది. ఎంతవరకైనా తీసుకెళుతుందని. ఒక్కసారి మనిషి పూర్తిగా కంట్రోల్ తప్పుతాడు. దాని ఫలితం దారుణంగా ఉంటుంది.. అదే జరిగింది కూడా. థానెలోని ఓ ఆసుపత్రి క్లినిక్‌లో పట్టరాని కోపంతో మహిళా రిసెప్షనిస్టుపై దాడి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. చివరకు అరెస్టయ్యాడు. అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
మహారాష్ట్ర ఇటీవల భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా థానెలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అసలే వర్షాకాలం.. చిన్నపిల్లలకు సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్ వద్ద పేరెంట్స్ వెళ్తుంటారు. థానెలోని కళ్యాణ్‌లోని శ్రీ బాల చితిఖా క్లినిక్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
అనారోగ్యం కారణంగా తమ పిల్లలను చూపించడానికి క్లినిక్‌కి చాలామంది పేరెంట్స్ వచ్చారు. వచ్చినవారిని వరుసలో కూర్చొబెట్టి రిసెప్షనిస్టు ఒకొక్కరిని డాక్టర్ వద్ద పంపిస్తోంది. అయితే చాలామంది డాక్టర్ అపాయింట్‌మెంట్ ఎదురు చూస్తున్నారు. చాలాసేపు చూసిన తర్వాత ఓ వ్యక్తి అమాంతంగా రిసెప్షనిస్టుపై తిరుగబడ్డాడు.
ఓ వైపు రిసెప్షనిస్టు- వ్యక్తి మధ్య వాగ్వాదం జరుగుతుండగా, వేగంగా ఆ వ్యక్తి బంధువు దూసుకొచ్చాడు. పట్టరాని కోపంతో యువ రిసెప్షనిస్టుపై దాడికి పాల్పడ్డాడు. యువతి జట్టు లాగి కిందపడేశాడు. ఆ సమయంలో అక్కడనున్న కొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యువతిని కిందపడేసి కొట్టేశాడు.
ALSO READ: ట్రాక్ పై రన్నింగ్ లో ట్రైన్.. పందెం కాసి మరీ పట్టాలపై యువకుడు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు గోపాల్ ఝా, అతడి సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గోపాల్ మద్యమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. రిసెప్షనిస్ట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి మెడ, కాళ్ళు ఛాతీపై బలమైన గాయాలు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి. గోకుల్, అతడి సోదరుడు రంజిత్ ఝా అరెస్టు అయ్యారు. కళ్యాణ్‌లోని కోల్షేవాడి ఉల్హాస్ నగర్ ప్రాంతంలో గోకుల్‌పై పలు రకాల కేసులున్నాయి. అందులో దాడి కేసులు ఉన్నాయి. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.
मुंबई से सटे कल्याण में एक प्राइवेट हॉस्पिटल में मरीज के परिजनों ने रिसेप्शन पर मौजूद लड़की को बेहरमी से पीटा.
रिसेप्शन पर मौजूद लड़की ने मरीज के परिवार को बोला कि डॉक्टर अभी बिजी है, इस पर मरीज का परिवार गुस्से में आया और लड़की के साथ मारपीट करने लगा. pic.twitter.com/iyje69ihTU
— Vivek Gupta (@imvivekgupta) July 22, 2025