E-Paper
Advertisement

కెఫిన్ మోతాదు ఎక్కువైతే మహిళల్లో.. హార్మోన్ల అసమతుల్యత తప్పదా ? అసలు నిజాలివే!

కెఫిన్ మోతాదు ఎక్కువైతే మహిళల్లో.. హార్మోన్ల అసమతుల్యత తప్పదా ? అసలు నిజాలివే!
Advertisement

Side effects of caffeine: రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో అలసటను తరిమికొట్టడానికి చాలామంది టీ లేదా కాఫీలను ఆశ్రయిస్తుంటారు. ఆఫీసుల్లో .. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజుకు నాలుగు ఐదు కప్పుల కాఫీ తాగడం సర్వసాధారణమైపోయింది. అయితే.. మగ వారితో పోలిస్తే మహిళల శరీర తత్వం చాలా భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా వారి శరీరంలో హార్మోన్ల మార్పులు చాలా సున్నితంగా జరుగుతుంటాయి. మరి అలాంటి మహిళలు కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

హార్మోన్ల సమతుల్యతపై కెఫిన్ ప్రభావం:

మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ , కార్టిసాల్ వంటి హార్మోన్లు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మనం అధికంగా టీ, కాఫీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నప్పుడు, శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ కార్టిసాల్ స్థాయిలు ఎక్కువైతే.. అది నేరుగా ఈస్ట్రోజెన్, ఇతర పునరుత్పత్తి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల మూడ్ స్వింగ్స్, ఆందోళన, విపరీతమైన అలసట వంటి సమస్యలు వస్తాయి.

నెలసరి సమస్యలు , పీరియడ్స్ పెయిన్:

Advertisement

చాలా మంది మహిళల్లో పీరియడ్స్.. సరిగ్గా రాకపోవడానికి లేదా తీవ్రమైన కడుపునొప్పి రావడానికి లైఫ్ స్టైల్ తో పాటు ఈ కెఫీన్ వాడకం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ వచ్చే.. ముందు రోజుల్లో కాఫీ లేదా టీ ఎక్కువగా తాగడం వల్ల, రొమ్ము నొప్పి, చిరాకు, నిద్ర లేమి వంటి సమస్యలు మరింత పెరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావడం లేదా సక్రమంగా లేకపోవడం జరగొచ్చు.

నిద్రలేమి, ఒత్తిడి:

కెఫిన్ అనేది ఒక శక్తివంతమైన ఉద్దీపనకం. ఇది మెదడును ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారికి నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర లేమి సమస్య ఏర్పడితే అది నేరుగా హార్మోన్ల ప్రొడక్షన్‌పై ప్రభావం చూపుతుంది. హార్మోన్లు సరిగ్గా పనిచేయకపోతే .. బరువు పెరగడం, చర్మంపై మొటిమలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

Advertisement

Also Read: నిద్రలో చంటి బిడ్డ నవ్వడం, ఏడవడం లేదా శబ్దాలు చేయడం సాధారణమేనా? దీనికి అర్థం ఏంటి?

ఎంత మోతాదు సురక్షితం?

అలా అని టీ, కాఫీలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక రోజులో ఆరోగ్యకరమైన మహిళలు గరిష్టంగా 200 నుంచి 300 మి.గ్రాముల కెఫీన్‌ను మాత్రమే తీసుకోవాలి. అంటే.. సుమారుగా రోజుకు 1 లేదా 2 కప్పుల మితమైన మోతాదులో కాఫీ లేదా టీ తాగితే ఎలాంటి హాని జరగదు. కానీ దీనికి మించి రోజంతా ఎక్కువ సార్లు తాగుతుంటే.. మాత్రం అది మీ శరీరంలోని హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

టీ, కాఫీలు మన అలసటను తీర్చడానికి బాగానే.. ఉంటాయి కానీ, వాటిని వ్యసనంగా మార్చుకుని పరిమితికి మించి తీసుకుంటే.. మాత్రం అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. ముఖ్యంగా మహిళలు తమ హార్మోన్ల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కెఫీన్ మోతాదును తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చు.

Related News

ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

ఆధ్యాత్మికత కాదు.. దేవుడిని పూజించేటప్పుడు కళ్లు మూసుకోవడం వెనుకున్న పక్కా సైన్స్ ఇదే!

దుర్గాపూజలో మీ లైఫ్ పార్ట్‌నర్‌తో మ్యాచింగ్ డ్రెస్ ఇలా ట్విన్నింగ్ చేయండి.. ఇద్దరి ఫొటోలు అదిరిపోతాయి

నవరాత్రుల్లో ఇక బ్రేక్‌ఫాస్ట్ టెన్షన్‌కు చెక్ .. ఉపవాసం చేసేవారికి 7 ఈజీ రెసిపీలు

బడ్జెట్‌లో లాంగ్ లాస్టింగ్ లిప్‌స్టిక్ కావాలా? ఇవిగో 7 బెస్ట్ ఆప్షన్స్

పర్ఫెక్ట్ కొలతలతో..తియ్యని చక్కెర పొంగలి క్షణాల్లోనే రెడీ చేయండిలా!

తోటకూర వెల్లుల్లి కారం ఇలా చేస్తే..లొట్టలేసుకుంటూ తింటారు!

నోట్లో వేస్తే కరిగిపోయే ఆలూ మలై టిక్కీ..తయారీ విధానం ఇదే!

Big Stories

Advertisement
×