E-Paper
Advertisement

బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!

బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!
Advertisement

Gionee StylFit GSW6 smartwatch: చేతికి ఒక స్టైలిష్ వాచ్ ఉంటే.. ఆ లుక్కే వేరు.. అందులోనూ అది స్మార్ట్‌ వాచ్‌ అయి ఉండి, మన ఆరోగ్య వివరాలను.. ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు చేయకుండా.. తక్కువ ధరలో అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారి కోసం జియోని కంపెనీ తెచ్చిన అద్భుతమైన మోడలే ఇది. కేవలం రూ.1,799 ధరతో.. అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ వాచ్ విశేషాలు.. ఏంటో ఇప్పుడు వివరంగా.. చూద్దాం.

డిజైన్, డిస్‌ప్లే :

ఈ స్మార్ట్‌ వాచ్ చూడటానికి.. చాలా ప్రీమియమ్‌గా, మోడర్న్‌గా ఉంటుంది. దీనిలో.. ఇచ్చిన రెక్టాంగులర్ డయల్, జింక్ అలాయ్ బాడీ దీనికి ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తాయి. ఇందులో 1.7 అంగుళాల (4.3 సెం.మీ) ఫుల్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీని టచ్ రెస్పాన్స్.. చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే IP68 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల నీటి తుంపర్లు పడినా లేదా వర్షంలో.. తడిచినా వాచ్ పాడవుతుందనే టెన్షన్ ఉండదు.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ :

Advertisement

ఈ బడ్జెట్ రేంజ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ లభించడం ఈ వాచ్‌లోని అతిపెద్ద ప్లస్ పాయింట్. వాచ్‌లోనే ఇన్‌బిల్ట్ మైక్ , స్పీకర్ ఉండటం వల్ల ఫోన్ జేబులో.. నుంచి తీయకుండానే నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఆప్షన్ బాగా ఉపయోగ పడుతుంది.

హెల్త్ ,ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే.. వారికి ఈ స్మార్ట్‌ వాచ్ ఒక మంచి డాక్టర్ లా పని చేస్తుంది. దీనిలో.. 24 గంటలూ పని చేసే హార్ట్ రేట్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను.. గుర్తించే.. SpO2 సెన్సార్ ఉన్నాయి. వీటితో.. పాటు స్లీప్ మానిటర్, కాలరీ కౌంటర్,పెడోమీటర్, మహిళల కోసం.. ప్రత్యేకంగా మెన్‌స్ట్రువల్ ట్రాకర్ కూడా పొందుపరిచారు. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ దీనిలో అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ:

Advertisement

ఈ వాచ్‌లో 220mAh బ్యాటరీని అందించారు. సాధారణ వాడకంపై.. ఇది బ్లూటూత్ కాలింగ్‌తో.. కలిపి సుమారు 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఒక వేళ కాలింగ్ ఫీచర్ ఆఫ్.. చేసి వాడితే. మరింత ఎక్కువ రోజులు వస్తుంది. 100కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్, కస్టమైజ్డ్ వాచ్ ఫేస్ ఆప్షన్స్ ద్వారా మీ మూడ్‌కి తగినట్లుగా వాచ్ స్క్రీన్‌ను మార్చుకోవచ్చు.

Also Read: మ్యాప్ నేవిగేషన్ సపోర్ట్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే?

బడ్జెట్, వాల్యూ ఫర్ మనీ:

మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ వాచ్‌లతో పోలిస్తే.. జియోని స్టైల్‌ఫిట్ GSW6 ధర చాలా తక్కువగా ఉంది.కేవలం రూ.1,799 ధరకే బ్లూటూత్ కాలింగ్,హెల్త్ సెన్సార్లు లభించడం నిజంగా గొప్ప విషయమని చెప్పవచ్చు.

మీరు తక్కువ బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్, కాలింగ్ ఫీచర్, హెల్త్ ట్రాకింగ్ ఆప్షన్స్ ఉన్న మంచి స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. ఇది మీ రోజువారీ అవసరాలకు.. సరిగ్గా సరిపోయే పర్ఫెక్ట్ బడ్జెట్ గాడ్జెట్!

Related News

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

మీ ఫోన్‌లో ఫోటోలు ముందులా రావట్లేదా? కెమెరా క్వాలిటీ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!

10,000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారత్‌లోకి వివో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×