BigTV English

Best Friends Vs Crush: ఇద్దరు ప్రాణ స్నేహితులు మధ్య నిజంగానే ఒక అమ్మాయి చిచ్చు పెట్టగలదా?

Best Friends Vs Crush: ఇద్దరు ప్రాణ స్నేహితులు మధ్య నిజంగానే ఒక అమ్మాయి చిచ్చు పెట్టగలదా?

చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాము. చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన ఇద్దరు ప్రాణ స్నేహితులు.. పెద్దయ్యాక మాత్రం ఒక అమ్మాయి ప్రేమ కోసం విడిపోతారు. బద్ధ శత్రువుల్లా మారిపోతారు. నిజ జీవితంలో అలా జరిగే అవకాశం ఉంటుందా? ఒక అమ్మాయి ఇద్దరు ప్రాణ స్నేహితులును అంతగా ప్రభావితం చేయగలదా? వారిద్దరి స్నేహాన్ని విడగొట్టగలదా? అనే సందేహాలు ఎక్కువమందిలో ఉంటాయి. అధ్యయనాలు మాత్రం ఖచ్చితంగా అమ్మాయి వల్ల ప్రాణ స్నేహితులు కూడా విడిపోతారని చెబుతోంది. అది ప్రేమకు ఉండే బలం అని వివరిస్తోంది.


రాహుల్, అనంత్ అనే ఇద్దరు అబ్బాయిలు ఆరో తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్లో కూడా ఒకే కాలేజీలో చేరారు. అప్పుడు కూడా వారు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ చదువులు పూర్తి చేసి ఉద్యోగాలలో చేరారు.

వీరికి ఉద్యోగాలు ఒకే నగరంలో రావడంతో ఒక ఫ్లాట్‌ను అద్దెకి తీసుకొని అందరూ ఒకే చోట ఉంటున్నారు. ప్రాణ స్నేహితులైన రాహుల్, అనంత్ ఇద్దరూ కూడా అన్నతమ్ముళ్లలా కలిసిమెలిసి ఉండసాగారు. ఈ లోపు అనంత్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. ఆమెను కూడా ఈ ఫ్లాట్లోనే ఉంచుదామని అడిగాడు. దానికి రాహుల్ ఒప్పుకున్నాడు. కానీ ఆమె వచ్చాక అనంత్ ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది.


అప్పటివరకు రాహుల్‌తో కలిసిమెలిసి ఉన్న అనంత్ ఆ అమ్మాయి కోసం రాహుల్ ని దూరం పెట్టసాగాడు. ఆ అమ్మాయి తోనే కలిసి తినడం, కలిసి టీవీ చూడడం, షికారులకు వెళ్లడం వంటివి చేశాడు. రాహుల్‌ని కనీసం పట్టించుకోలేదు. రోజులో ఒకటో రెండు సార్లు మాత్రమే పలకరించేవాడు. అంతవరకు ప్రాణంగా చూసుకున్న స్నేహితుడు ఇలా తనను పట్టించుకోపోయేసరికి రాహుల్‌కు చాలా బాధనిపించింది. ఒక అమ్మాయి కోసం తనని ఇంతగా దూరం చేస్తాడా? అని బాధపడ్డాడు. కానీ అతడి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలనుకున్నాడు.

ఓసారి అనంత్ తన ప్రియురాలితో లంచ్ చేస్తూ రాహుల్‌ని కూడా రమ్మని పిలిచాడు. రాహుల్ అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. కానీ అతనికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అనంత్‌తో కలిసి తినడం కొత్తేమీ కాదు, కానీ అతని జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి కూడా అక్కడ ఉండడంతో తన స్థానం తేలికగా మారినట్టు భావించాడు. నెమ్మదిగా వారితో మాట్లాడడం తగ్గించాడు. ఒకే ఫ్లాట్లో ఉంటున్నా మాట్లాడుకోవడం ఆగిపోయింది. శూన్యంగా మారిపోయింది. దీంతో రాహుల్‌లో అసహనం పెరిగిపోయింది. ఇక అక్కడ ఉండడం మంచిది కాదు అనుకున్నాడు.

అనంత్‌తో తాను వేరే ఫ్లాట్ తీసుకుంటానని చెప్పాడు. దానికి అనంత్ కూడా ఏమీ అడ్డు చెప్పకుండా వెళ్లిపొమ్మన్ని అన్నాడు. దీంతో రాహుల్ మనసు పూర్తిగా విరిగిపోయింది. కేవలం మధ్యలో వచ్చిన ఒక అమ్మాయి కోసం తమ స్నేహాన్ని పణంగా పెట్టాడని ఎంతో బాధపడ్డాడు. ఇలాంటి సంఘటనలు కేవలం రాహుల్ జీవితంలోనే కాదు ఎంతో మంది జీవితాల్లో జరుగుతాయి.

Also Read: భార్యాభర్తల మధ్య విడాకులు పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఇవేనట

స్నేహమా? ప్రేమా? అని అడిగితే సినిమాల్లో స్నేహమే గెలిచినట్టు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం అమ్మాయి వెంట నడిచే అబ్బాయిలే ఎక్కువ. ఒక అమ్మాయి ప్రేమ ఇద్దరు ప్రాణ స్నేహితులను పూర్తిగా విడదీయగలదు. కానీ ఆ ప్రేమ ముక్కలైనప్పుడు తిరిగి స్నేహమే వచ్చి ఓదార్చాలి. అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.

ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ దొరకగానే స్నేహాన్ని బయటకి తోసేయడం మాత్రం పెద్ద తప్పు. ప్రేమకు బ్రేకప్‌లు ఉంటాయి, కానీ స్నేహంలో ఎలాంటి బ్రేకప్‌లు ఉండవు. ప్రేమకు ఎంత విలువిస్తారో, స్నేహానికి కూడా అంతే విలువను ఇవ్వండి. ఎప్పటికైనా ఆ స్నేహం మీకు సాయం చేసి తీరుతుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×