OTT Movie : డిజిటల్ మీడియాలో కొరియన్ మూవీస్ హవా నడుస్తోంది. ఒకప్పుడు ఈ మూవీస్ ని ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కరోన సమయంలో లాక్ డౌన్ పుణ్యమా అని ఈ మూవీస్ చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా కొరియన్ సినిమాలను చూస్తున్నారు. స్టోరీని స్క్రీన్ ప్లే తో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఒక కొరియన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
యూట్యూబ్ (Youtube)
ఇది ఒక కొరియన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మూవీ చూస్తున్నంత సేపు చాలా సరదాగా ఉంటుంది. తండ్రి కూతుర్ల మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు “డాడీ యు డాటర్ మి” (Daddy you Daughter me).ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
తండ్రి ఒక కాస్మెటిక్ కంపెనీలో పనిచేస్తూ కూతుర్ని చదివిస్తూ ఉంటాడు. ఆ కంపెనీలో అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సేల్స్ తగ్గుతుండటంతో ఇతని జాబ్ కూడా పోయేస్థితికి వస్తుంది. అలాగే కూతురు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. ఆమెకు సింగింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఒకరోజు తండ్రి కూతురుతో నువ్వు సరిగ్గా చదవకపోతే ఎలా అని గట్టిగా మందలిస్తాడు. అలా కారులో ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడుతుండగా ప్రమాదం జరుగుతుంది. అయితే అనుకోకుండా ఇక్కడ వీరి ఆత్మలు ఒకరి బాడీలో ఒకరికి ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఇది ఎలా జరిగిందో అర్థం కాక ఇద్దరూ తల పట్టుకుని కూర్చుంటారు. ఈ విషయాన్ని ఫ్యామిలీ డాక్టర్ కి చెప్పగా అతను ఫ్రాంక్ చేస్తున్నారేమో అనుకొని వీళ్ళను లైట్ తీసుకుంటాడు. చేసేదేం లేక వీళ్ళ తాతయ్యకి ఫోన్ చేస్తారు. ఈ విషయం గురించి నాకు తెలుసు ఒక వారం రోజులు ఆ స్పిరిట్స్ అలాగే ఉంటాయి. తర్వాత అవి మారుతాయి అని చెప్తాడు.
అయితే ఈ వారం రోజులు గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ప్రమాదమని చెప్తాడు. ఈ వారం రోజులు వీళ్ళు ఒకరిలా ఒకరు నడుచుకుంటారు. తండ్రి ఆఫీసులో కూతురు చేసే హంగామా, స్కూల్లో కూతురు ప్లేస్ లో తండ్రి చేసే హంగామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కంపెనీలో కాస్మెటిక్ సేల్స్ పెరగడానికి కూతురు ఇంటర్వ్యూ హెల్ప్ చేస్తుంది. కూతురు మార్కులు రావడానికి తండ్రి చదువుకోవాల్సి వస్తుంది. చివరికి వీరి ఆత్మలు వారి శరీరంలోకి మళ్లీ వెళతాయా? వీళ్ళ తాతయ్యకి ఈ ఆత్మల గురించి ఎలా తెలుస్తుంది? వీళ్లు జీవితాంతం ఇలాగే ఉండిపోతారా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ “డాడీ యు డాటర్ మి” (Daddy you Daughter me) ని తప్పకుండా చూడండి.