BigTV English

Alcohol and Liver: వారానికి ఒకసారి మాత్రమే మద్యం తాగితే కాలేయవ్యాధి రాదా?

Alcohol and Liver: వారానికి ఒకసారి మాత్రమే మద్యం తాగితే కాలేయవ్యాధి రాదా?

తాగుబోతులు మద్యం తాగేందుకు కొత్త సాకులు వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారిలో చాలామంది ‘నేను వారానికి ఒకసారి మాత్రమే తాగుతాను, నా ఆరోగ్యానికి ఏం కాదు’ అని చెబుతూ ఉంటారు. అయితే అది నిజమేనా? వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం తాగడం వల్ల దాని ప్రభావం శరీరంపై తక్కువగా పడుతుందా? వారికి ఎలాంటి కాలేయ వ్యాధులు రావా? దీనికి సమాధానాలు తెలుసుకుందాం.


వారాంతంలో మాత్రమే తాను మద్యం తాగుతానని మిగతా రోజులు, తాగనని చెప్పేవారు ఎక్కువే. వారానికి ఒక్కసారి మాత్రమే మద్యం తాగితే వారి కాలేయంపై ఎటువంటి ప్రభావం పడదని అనుకోవడం పూర్తిగా అపోహే. ఇది కాలేయంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది.

ఎంత తాగినా ప్రమాదమే
వైద్యులు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి వారానికి ఒకసారి మాత్రమే మద్యం తాగితే.. అది అతడు తాగే పరిమాణం పై ఆధారపడి ఉంటుంది. తాగే పరిమాణం అధికంగా ఉంటే కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. తక్కువగా తాగితే ప్రభావం కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో అంటే నాలుగు నుంచి ఐదు పెగ్గులు లేదా అంతకంటే ఎక్కువ తాగితే దాన్ని అతిగా తాగడం అని అంటారు. అలా తాగితే కచ్చితంగా వారి ఆ కాలేయంతో పాటు ఇతర అవయవాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఇక ప్రతిరోజు కొద్దికొద్దిగా తాగే వారు కూడా తాము కొంచెమే తాగుతున్నామని అనుకుంటారు.. కానీ ఆ కొద్దిగా మద్యం కూడా కాలేయానికి నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా తాగడం వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. కొవ్వు కాలేయం, కాలేయ వాపు, కాలేయ సిర్రోసిస్ వంటి వ్యాధులకు కారణమవుతాయి.


మద్యాన్ని ప్రాసెస్ చేసేది కాలేయమే
శరీరంలో ఆల్కహాల్ చేరిన తర్వాత మొదట ప్రాసెస్ చేసేది కాలేయమే. కానీ ఆల్కహాల్ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అది కాలేయంపై భారాన్ని పెంచుతుంది. దాన్ని సరిగా విచ్చినం చేయలేదు. కాలేయ కణాలను దెబ్బతీసే టాక్సిన్స్ ఏర్పడడానికి దారితీస్తుంది. దీనివల్ల కొవ్వు కాలేయం హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

కొంతమందికి జీవక్రియ వేగంగా జరుగుతుంది. అలాంటివారు త్వరగా ఆల్కహాల్ ను జీర్ణం చేసుకుంటారు. కానీ అప్పటికే కాలేయ పనితీరు బలహీనంగా ఉన్నవారు, ఊబకాయం ఉన్నవారు, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు, ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారు మాత్రం వారానికి ఒకసారి కూడా మద్యం తాగడం ప్రమాదకరమే.

మద్యం కొంచెమైనా లేదా ఎక్కువైనా… ఎలా తీసుకున్నా కూడా సురక్షితం కాదు. మద్యం సేవించిన తర్వాత కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టమే. కాబట్టి మద్యం పూర్తిగా మానేస్తేనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వారాంతంలో తాగినా, ప్రతిరోజు తాగినా కూడా ప్రభావం కచ్చితంగా కాలేయంపై పడుతుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×