డయాబెటిస్ అనేది నయం చేయలేని వ్యాధి. ఒకసారి వచ్చిందంటే అది శాశ్వతంగా శరీరంలోనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా నయం కాదు. కానీ మందులతో ఆహారపు అలవాట్లతో దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు మందులు వాడుతూ కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకుంటే చక్కెర వ్యాధి కచ్చితంగా శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. ముఖ్యంగా చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో కాకరకాయ పరాటాను చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ వెజ్ పరాటా ప్రతిరోజు తింటే కొన్ని రోజుల్లోనే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
కాకరకాయతో ఆరోగ్యం
కాకరకాయ పరాటా తినడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ కాకరకాయ పరాటాని తింటే డయాబెటిస్ రోగులు ఆరోగ్యంగా జీవిస్తారు. కాకరకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇవి చేదుగా ఉండవచ్చు. కానీ డయాబెటిస్ రోగులకు ఔషధంతో సమానం. డయాబెటిస్ రోగులు కాకరకాయ పరాటా తినడం ద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
కాకరకాయ పరాటా రెసిపీ ఇదిగో
కాకరకాయలను శుభ్రంగా కడిగి, ఆ తర్వాత నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ మొత్తాన్ని మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ కాకరకాయ మిశ్రమంలో ఉల్లిపాయల తరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని బాగా కలిపి రెడీ చేసుకోవాలి. పిండిలోంచి ఒక ముద్దను తీసి పూరిలాగా ఒత్తాలి. మధ్యలో ఈ కాకరకాయ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ మడత పెట్టాలి. పరాటాలాగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి అర స్పూన్ నెయ్యిని వేసి ఈ పరాటాను రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే కాకరకాయ పరాటా రెడీ అయినట్టే. దీన్ని ప్రతిరోజు మీరు తినేందుకు ప్రయత్నించండి. కచ్చితంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
ఉదయం అల్పాహారంలో కాకరకాయ పరాటాని తిని మిగతా సమయాల్లో స్వీట్లు, నూనెలో వేయించిన ఆహారాలు, ప్రాసెసింగ్ చేసిన పదార్థాలు, మైదాతో వండిన ఆహారాలు తింటే మాత్రం ఎలాంటి లాభము లేదు. ఉదయం అల్పాహారంలో ఈ కాకరకాయ పరాటా తిని మధ్యాహ్నం కూడా చక్కెర తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ప్రోటీన్ నిండుగా ఉండే పదార్థాలను తింటే మంచిది. ఇలా కొన్ని రోజులు పాటు మీరు పాటిస్తే ఖచ్చితంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. మీ ఆరోగ్యం చక్కబడుతుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది కచ్చితంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.