Moles: చర్మంపై పుట్టు మచ్చలు రావడం అనేది చాలా సధారణం. అయితే ఇవి ఎందుకు వస్తాయనేదాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? కొందరికి చాలా పుట్టు మచ్చలు ఉంటాయి. వీటి వల్ల కొన్ని సార్లు ఆరోగ్యానికి హాని కలిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అసలు పుట్టు మచ్చలు రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి?
పుట్టు మచ్చలు ఎందుకు వస్తాయనే దాని గురించి ఇప్పటికీ ఖచ్చితమైన కారణమంటూ ఏం లేదు. కానీ, కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల పుట్టు మచ్చలు వచ్చే ఛాన్స్ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కుంటుంబ సభ్యులలో ఎవరికైరా పుట్టు మచ్చలు ఉంటే వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉందని అంటున్నారు.
పుట్టుమచ్చలు ప్రమాదకరమా?
చాలా పుట్టు మచ్చలు ఎటువంటి హానిని కలిగించవు, అయితే మీరు ఏవైనా ఆందోళన కలిగించే మార్పులను గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండటం, వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ, కొన్ని రకాల పిగ్మెంటెడ్ పుట్టు మచ్చల వల్ల ఆరోగ్యానికి హాని జరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు దీని వల్ల మెలనోమా వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఇది ఒక రకమైన స్కిన్ క్యాన్సర్.
వీటి వల్ల క్యాన్సర్ వస్తుందా?
కొన్ని రకాల పుట్టు మచ్చలు, ముఖ్యంగా పిగ్మెంట్ ఉన్నవి చర్మ క్యాన్సర్‌గా అభివృద్ధి చెందే ప్రమాదం ఉందట. అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉందట. పుట్టు మచ్చలు విపరీతంగా పెరిగితే క్యాన్సర్ సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా పుట్టు మచ్చలు వస్తే నెగ్లెక్ట్ చేయకూడదని అంటున్నారు.
ALSO READ: ఆయుర్వేద చిట్కాలతో హెయిర్ ఫాల్‌కి చెక్
క్యాన్సర్ లక్షణాలు ఏమిటి?
క్యాన్సర్ కారణంగానే పుట్టు మచ్చలు పెరిగితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయట. చాలా మందిలో మెలనోమా వంటిది ఎటాక్ అయినప్పుడు పుట్టు మచ్చల దగ్గర బ్లడ్ గడ్డకట్టినట్లుగా కనిపిస్తుందట. కొన్ని సార్లు పుట్టు మచ్చ చుట్టూ దురద, నొప్పి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
పుట్టు మచ్చల ఆకారం, పరిమాణం లేదా రంగులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వడం మంచిది. క్యాన్సర్ సంకేతాలను గమనిస్తే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం చాలా అవసరం. బయాప్సీ లేదా ఇతర పరీక్షల ద్వారా స్కిన్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.