OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తున్నాయి. రకరకాల కథలతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలను ఒంటరిగా చూడగలిగే ధైర్యం చాలా మందికి ఉండదు. కొన్ని సినిమాలు చూసినప్పుడు జ్వరం కూడా వస్తూ ఉంటుంది. అలా భయపెట్టే మూవీలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ మూవీలో, ఒక అడవి ప్రాంతంలో హోటల్ ని పెట్టాలనుకుంటుంది హీరోయిన్. అందులో జరిగే భయంకరమైన సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ పేరు ‘హౌస్ ఆఫ్ స్పాయిల్స్’ (House of spoils). 2024 లో వచ్చిన ఈ మూవీకి బ్రిడ్జేట్ సావేజ్ కోల్, డేనియల్ క్రుడీ దర్శకత్వం వహించారు. ఇందులో అరియానా డిబోస్, బార్బీ ఫెరీరా, ఏరియన్ మోయెడ్ నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ మంచి చెఫ్ గా ఒక రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటుంది. అయితే ఆమె చిరకాల కోరిక, సొంతంగా ఒక రెస్టారెంట్ ని నడపాలనుకుంటుంది. ఈ విషయం హీరోయిన్ తను పనిచేసే రెస్టారెంట్ ఓనర్ కి చెప్తుంది. ఓనర్ అంత మంచి చెఫ్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అయినా ఆమె జాబ్ కి రిజైన్ చేసి, తను కొత్తగా స్టార్ట్ చేయబోయే హోటల్ వైపు ప్రయాణం చేస్తుంది. హీరోయిన్ తన స్నేహితుడైన ఆండ్రూ తో కలిసి హోటల్ని సర్దుతూ ఉంటుంది. అయితే అందులో కూరగాయలు, పురుగుల రూపంలో పాడైపోతూ కనబడుతుంటాయి. ఆ హోటల్ ను ఇదివరకే కొంతమంది రన్ చేసి ఉంటారు. ఆ తరువాత అది ఒక పాడు బడ్డ బిల్డింగ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ హోటల్ కి ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది వస్తారు. వాళ్లకు కొత్త రకాల వంటలను చేసే బాధ్యత హీరోయిన్ తీసుకుంటుంది. అక్కడ ఉన్న కూరగాయలతో వంటను వండుతుంది. ఎంత ప్రయత్నించినా అందులో ఉన్న పదార్థాలు, పురుగులు పడిపోతూ ఉంటాయి.
ఆ తర్వాత బయట నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించి, డిషెస్ రెడీ చేస్తుంది. అవి మామూలుగా ఉన్నాయని, వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా వెళ్ళిపోతారు. అలా మరొకసారి కూడా జరగడంతో, ఆండ్రూ హీరోయిన్ తో చాలా కోపంగా మాట్లాడుతాడు. అయితే ఆమె శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. ఒక ముసలామె రూపం హీరోయిన్ కి కనపడుతూ ఉంటుంది. హీరోయిన్ ఇదంతా గమనించి బెస్మెంట్ లో ఉన్న వస్తువులను పరీక్షిస్తుంది. అక్కడికి ముసలామె ఆత్మ వచ్చి హీరోయిన్ ను బాగా భయపెడుతుంది. చివరికి హీరోయిన్ ఆ ప్రాంతంలో హోటల్ పెడుతుందా? దయ్యం దెబ్బకు పారిపోతుందా? హోటల్ కి ఇన్వెస్ట్ చేయడానికి మనుషులు వస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.