BigTV English
Advertisement

OTT Movie : డాక్టర్ నే బురిడీ కొట్టించే సైకో పేషంట్… అమ్మాయిని లేపుకెళ్లి ఏం చేశాడంటే?

OTT Movie : డాక్టర్ నే బురిడీ కొట్టించే సైకో పేషంట్… అమ్మాయిని లేపుకెళ్లి ఏం చేశాడంటే?

OTT Movie : ట్విస్టులతో సాగిపోయే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, మొదటినుంచి చివరి వరకు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. మలయాళం నుంచి వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించి, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ తో సాగిపోయే ఈ మూవీ, మానసిక వికలాంగురాలు అయిన ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అథిరన్’ (Athiran). ఈ మూవీలో సాయి పల్లవి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ థామస్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. 2019 లో మలయాళంలో ‘అథిరన్’ పేరుతో విడుదలైన ఈ మూవీని, 2021 తెలుగులో అనుకోని అతిధి పేరుతో  డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆహా (aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఒక మారుమూల ప్రాంతంలో బెంజిమన్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సైకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తుంటాడు. అయితే అక్కడికి నాయర్ అనే వ్యక్తి ఇన్స్పెక్షన్ కి వస్తాడు. బెంజిమెన్ తన దగ్గర ఉన్న పేషెంట్లకు కరెంట్ షాక్ ఎక్కువగా ఇస్తున్నాడని, ఇన్స్పెక్షన్ కి పంపివుంటారు నాయర్ అనే డాక్టర్ ని. అతడు హాస్పిటల్ కి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తే, హాస్పిటల్ ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో బెంజిమెన్ తన దగ్గర ఉన్న పేషెంట్స్ ని నాయర్ కి పరిచయం చేస్తాడు. అయితే నిత్య అనే పేషెంట్ ని పరిచయం చేయకుండా దాచిపెడతాడు బెంజిమెన్. ఈ విషయం తెలుసుకున్న నాయర్ ఆమెను చూపించమని గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆమె తన కూతురు అని, తన మానసిక స్థితి ఇంకా కుదుట పడలేదని చెప్తాడు బెంజిమన్. అప్పటినుంచి నిత్యని గదిలో పెట్టకుండా, తనతోపాటు తిప్పుకుంటూ ఉంటాడు. నాయర్ కి నిత్య, బెంజిమెన్ కూతురు కాదని అనుమానం వస్తుంది.

నిత్యకు సంబంధించిన 500 ఎకరాల ఆస్తిని సొంతం చేసుకోవాలని బెంజిమెన్ ప్రయత్నిస్తుంటాడు. ఆమెకు ఉన్న జ్ఞాపకాలని, కరెంట్ షాకిస్తూ పోగొడుతుంటాడు బెంజిమన్. తన ప్లాన్ కి నాయర్ అడ్డు వస్తున్నాడని, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు బెంజిమెన్. అయితే నాయర్, నిత్య ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ హాస్పిటల్ కి నాయర్ అనే మరొక వ్యక్తి వస్తాడు. హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కి వచ్చానని చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదివరకు వచ్చింది ఎవరని ఆలోచనలో పడతారు? చివరికి నాయర్ పేరు మీద వచ్చిన వ్యక్తి ఎవరు? నిత్య కి, అతనికి ఉన్న సంబంధం ఏమిటి? నిత్య వెనకున్న అసలు కథ ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆహా (aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న, ఈ ‘అథిరన్’ (Athiran) సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×